పాత ప్రాజెక్టులకు.. అరకొర నిధులు

10 Mar, 2020 01:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాలకు నిధుల కొరత 

టన్నెల్‌ ప్రాజెక్టుకు రూ 3.16 కోట్లు, కల్వకుర్తికి కేవలం రూ .2.29 కోట్లు 

కనీసంగా రూ.1,200 కోట్లు కేటాయింపులు కోరినా దక్కింది అంతంతే

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటిశాఖకు చేసిన నిధుల కేటాయింపుల్లో నిర్మాణంలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు మొండిచేయి ఎదురైంది. ప్రాజెక్టుల పూర్తికి రూ. వందల కోట్లలో కేటాయింపులు కోరితే కేవలం రూ.పదుల కోట్లలో మాత్రమే నిధులు దక్కాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రా జెక్టు, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులకూ అరకొర నిధులే ఇచ్చి ంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ చివరి దశలో ఉన్నాయి. వీటికింద ఉన్న కొద్ది పాటి భూసేకరణ, సహాయ పునరావాసానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే గణనీయంగా ఆయ కట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇలా కల్వకుర్తి పరిధిలో భూసేకరణకోసం రూ. 24.18 కోట్లు, పనులకు సంబంధించి రూ.79.32 కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉండగా, నెట్టెంపాడు పరిధిలో పనులకు చెందినవి రూ.11.47 కోట్లు, భూసేకరణవి రూ.8.98 కోట్లు, పునరావాసానివి రూ.1.83 కోట్లు బకాయిలు ఉండగా, భీమా పరిధి లోనూ రూ.36 కోట్ల బకాయిలున్నాయి. వీటిని తీర్చడంతో పాటు చివరి దశ పనుల పూర్తికి కనీసం రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది.అయినప్పటికీ బడ్జెట్‌లో మొత్తంగా రూ.50 కోట్ల నిధులే దక్కాయి. అధిక నిధుల అవసరాలున్న కల్వకుర్తి ప్రాజెక్టుకు కేవలం రూ.2.29 కోట్లతో సరిపెట్టారు.గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.3 కో ట్లు నిధుల కేటాయింపు జరగడం విశేషం.ఇక బీమాకు రూ.3.69 కోట్లు,నెట్టెంపాడుకు రూ.16.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.17.40 కోట్లతో నామమాత్రపు కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తి ఎలా సాధ్యమన్నది భవిష్యత్తే చెప్పాల్సి ఉంది.  

టన్నెల్‌ అక్కడే..ప్రాణహిత పడకే.. 
ఇక ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ పనుల పూర్తికి నిధులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పనులకు గాను రూ.126 కోట్ల మేర నిధులు పెండింగ్‌లో ఉండగా కేటాయించింది మాత్రం రూ.3.16 కోట్లు మాత్రమే. ఈ నిధులతో 43.89 కి.మీటర్ల టన్నెల్‌ పనుల్లో మిగిలిన మరో 10 కి.మీ.లకు టన్నెల్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంపై ఇప్పటికీ స్పష్టత లేదు.బ్యారేజీ దిగువన పనులు జరుగుతున్న ప్యాకేజీల్లో ఇంకా భూసేకరణ అవసరాలకు రూ.269 కోట్ల నిధులు అవసరమున్నా ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించినా కేవలం రూ.12 కోట్లు కేటాయించి ప్రభుత్వం పూర్తిగా నిరుత్సాహ పరిచింది.   

మరిన్ని వార్తలు