పుస్తకాలు లేవు.. పంతుళ్లూ లేరు

29 Dec, 2015 01:36 IST|Sakshi
పుస్తకాలు లేవు.. పంతుళ్లూ లేరు

చదువు సాగేదెట్లా..
 
పూర్తిగా అందని పాఠ్యపుస్తకాలు వేధిస్తున్న సబ్జెక్టు టీచర్ల కొరత రెగ్యులర్ ఎంఈఓలు లేక కొరవడిన పర్యవేక్షణమూడు నెలల్లో పదోతరగతి పరీక్షలు   విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

 
విద్యారణ్యపురి మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తికానుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థారుులో అందలేదు. జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పుస్తకాలు సరఫరా కాలేదు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నారుు. అంటే మధ్యలో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో పాటు సబ్జెక్టు టీచర్ల కొరత కూడా ఉంది. దీంతో ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఎలా రాయూలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యాసంవత్సరాని(2015-2016)కి జిల్లాలోని 3,260పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం అన్ని రకాల టైటిల్స్ కలిపి 21లక్షల 50వేల పాఠ్యపుస్తకాలు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరుుతే, 2014 సెప్టెంబర్ డైస్ లెక్కల ప్రకారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ 180 టైటిల్స్‌కు చెందిన 15,95,545 పుస్తకాలనే పంపించారు. అరుుతే, గతంలో ఉన్న లెక్కలతో పోలిస్తే.. ఈసారి కొన్ని పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరగగా, మరికొన్నింట్లో  తగ్గింది. అలాగే, పలు పాఠశాలల్లో ప్రాథమిక స్థారుు నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగిన కారణంగా.. పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది.

రెండో దశలో 5.94 లక్షల  పాఠశాల పుస్తకాల కోసం..
 మొదటి దశలో పంపించిన పాఠ్యపుస్తకాలు సరిపోని కారణంగా అన్ని టైటిళ్లు కలిపి 5,93,530 పాఠ్యపుస్తకాలు రెండో దశలో అందజేయూలని ఈ ఏడాది ఆగస్టులో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరుుతే, ప్రతిపాదనలు పంపించిన ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పుస్తకాలు అందలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ఇలా పాఠ్యపుస్తకాలు లేకుండానే సమ్మిటివ్-1 పరీక్షలు రాసేశారు. కాగా, ఎస్సె స్సీ విద్యార్థులకు మార్చి 1నుంచి 10వ తరగతి వరకు ప్రీ ఫైనల్, 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠ్యపుస్తకాలు అందని కారణంగా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అర్థం కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర మూ ల్యాంకన విధానంలో పరీక్షలు నిర్వహించనున్నందున పాఠ్యపుస్తకాలు కాకుండా టెస్ట్ పేప ర్లు, గైడ్లు చదివి పరీక్షలు రాసే పరిస్థితి లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్, ఎరుుడెడ్, రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీల పాఠశాలల్లో కలిపి 52,075మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 40శాతం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులుగా అనుకున్నా, మిగతా వారందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉంటారు. వీరిలో ఎక్కువ మందికి పాఠ్యపుస్తకాలు అందనందున వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్నది అధికారులకే తెలియాలి.

సబ్జెక్టు టీచర్ల కొరత.. వర్క్  అడ్జస్ట్‌మెంట్ ఆదేశాలు బేఖాతర్
 జిల్లాలోని  530వరకు ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. ఇందులోని కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యాబోధన సాగడం లేదు. అరుుతే, కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎస్‌జీటీలు ఎక్కువగా ఉండగా... వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద ఏ మండల పరిధి ఎస్‌జీటీలను అదే మండలంలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను కేటారుుస్తూ కలెక్టర్ అనుమతితో డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇలా 499మంది పీఎస్‌లు, యూపీఎస్‌ల్లోని ఎస్‌జీటీలను హైస్కూళ్లకు కేటారుుంచగా.. ఇందులో 50నుంచి 60శాతం మందే విధుల్లో చేరారు. మిగతా వారందరూ హైస్కూళ్లకు వెళ్లకుండా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు సమాచారం. పాలకుర్తి మండలం మల్లంపెల్లి హైస్కూల్, కొండపర్తి హైస్కూళ్లకు కేటారుుంచిన ఇద్దరేసి ఎస్‌జీటీలు ఇప్పటి వరకు విధుల్లో చేరకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అరుుతే, వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా కేటారుుంచిన ఉపాధ్యాయులు ఎందరు విధుల్లో చేరారన్న సరైన సమాచారం డీఈఓ కార్యాలయూనికి అందకపోవడం గమనార్హం.    
 
పాఠ్యపుస్తకాల కోసం  డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లా

ఈ విద్యాసంవత్సరంలో వచ్చిన పాఠ్యపస్తకాలు విద్యార్థులందరికీ సరిపోలేదు. రెండో దశలో మరికొన్ని పుస్తకాలు కావాలని ప్రతిపాదించగా ఇంత వరకూ రాలేదు. ఈ విషయూన్ని  వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. అరుునా, మరోసారి మాట్లాడుతాను. ఇక ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు ఇటీవలే వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద 499మంది ఎస్‌జీటీలను పంపిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా 60 నుంచి 70శాతమే విధుల్లో చేరారు. మిగతా వారు కూడా విధులకు హాజరయ్యేలా చూస్తాం. అలాగే, ఎస్సెస్సీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం.
 - పి.రాజీవ్, డీఈఓ
 
 ఇద్దరే రెగ్యులర్ ఎంఈఓలు

 జిల్లాలో 51మండలాలు ఉండగా హన్మకొండ, నల్లబెల్లి మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా 49 మండలాల్లో సీనియర్ పీజీ హెచ్‌ఎంలే ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తుండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. తరచూ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ తదితర పనుల్లో ఎంఈఓలు నిమగ్నమవుతున్న కారణంగా స్కూళ్లను పరిశీలించడం సాధ్యం కావడం లేదు. పీజీ హెచ్‌ఎంలు తమ పాఠశాలలను కూడా చూసుకోవాల్సి ఉండడం దీనికి మరో కారణమని చెప్పొచ్చు.
 

మరిన్ని వార్తలు