స్వైన్‌ఫ్లూ మృతుల వివరాలు ఎందుకివ్వలేదు?

5 May, 2019 02:29 IST|Sakshi

వివరాలివ్వడానికి అభ్యంతరం ఏమిటీ?

అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు, విషజ్వరాల బారిన పడి మరణించినవారి వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దాటవేత వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. తొలిసారి వివరాలు కోరినప్పుడు ఆయా రోగాల కారణంగా మృత్యువాత పడినవారి వివరాలు ఇవ్వకుండా ఎంతమంది ఆ రోగాల బారిన పడ్డారో, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో వంటి వివరాలే ఇచ్చిన అధికారులు రెండో సారి కూడా మృతుల వివరాలు ఇవ్వకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8న జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీ వల ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయా రోగాలు, విషజ్వరాల కారణంగా పేద రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని, రోగులు చని పోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని రోగులు మోయలేకపోతున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించారో, ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి ఆయా రోగా లు ఉన్నాయని తేలిందో, తీసుకున్న నివారణ చర్య లు తదితర వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

స్వైన్‌ఫ్లూపై ఆందోళన
తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చి న రెండో నివేదికలో మరణించిన రోగుల వివరాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ 5,574 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే 1,165 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలిందని నివేదికలోని వివరాలు చూసిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హైదరాబాద్‌లోనే 606 మంది ఉన్నారని, వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు మరణించిన రోగుల వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ను ఆదేశించింది. కేంద్రం కూడా తమ వాదనలతో కౌం టర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర వివరాలను తెలపాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు