కొండగట్టు దశ మారేనా..?

10 May, 2015 04:27 IST|Sakshi

 - ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్ల ప్రతిపాదనలుసిద్ధం
- నేడు దేవాదాయశాఖ మంత్రి రాక
మల్యాల :
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయం ఉత్తర తెలంగాణలో ఆదాయంలో రెండోస్థానంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం  నోచుకోవడం లేదు. సరిపడా సౌకర్యాలు భక్తులకు తిప్పలు తప్పడం లేదు. కొండపై గదులు లేక రాత్రి వేళ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం అంజన్న సన్నిధికి రానున్నారు. నీటి సమస్య, గదుల నిర్మాణం, సిబ్బంది క్వార్టర్స్‌తోపాటు డార్మెటరీ హా ల్ నిర్మాణం వంటి సమస్యల పరిష్కా రానికి ఆలయ అధికారులు రూ.50కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

శాశ్వత నీటి పరిష్కారం కోసం
అంజన్నను దర్శించుకునేందుకు ప్రతి మంగళవారం, శనివారం సుమారు 20 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. అరుుతే వీరికి ప్రధానంగా నీటి సమస్యే ఎదురవుతోంది. కొత్త కోనేరు అందుబాటులోకి రానున్నా.. ఈ సమస్య తీరే మార్గం కనిపించడం లేదు. కొంపల్లె చెరువు నుంచి రూ.2.15 కోట్లతో కొండగట్టుకు నీరు తరలించేందుకు పనులు చేపట్టారు. అరుుతే చెరువు నిండా నీరుంటేనే ఇక్కడికి చేరే పరిస్థితి. ఇప్పటికే ఏటా వేసవిలో తాగునీటికే ప్రజలు నీరందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చెరువు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. సమస్య శాశ్వత పరిష్కారానికి కొండగట్టు పరిసరాల్లోని భూముల్లో బావులు తవ్వి అక్కడి నుంచి సరఫరా చేసుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.
 
100 గదులు నిర్మిస్తేనే..
కొండగట్టులో 100 గదుల భవనం నిర్మిస్తేనే భక్తుల కష్టాలు తీరేది. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో 30 గదులున్నా నీటి సమస్యతో అందులో ఉండేందుకు భక్తులు ఆసక్తి చూపడం లేదు. రాత్రి కొండపైనే నిద్ర చేయాలన్న భక్తుల కోరిక గదుల వసతి లేక నెరవేరడం లేదు. దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ప్రైవేట్ లాడ్జీలే దిక్కవుతున్నారుు. మాస్టర్ ప్లాన్ అమలు చేసి, గదుల నిర్మాణం చేపడితే రాష్ట్రంలోనే ఈ ఆలయానికి విశిష్ట స్థానం లభిస్తుంది.   

ఆదాయం ఏటా రూ.15 కోట్లు
ఆంజనేయస్వామి ఆలయం హుండీ ఆదాయం ఏటా రూ. 10 కోట్లు కాగా, వివిధ రకాల టెండర్లు, టికెట్లు, ఇతర మార్గాల ద్వారా మరో రూ.5కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో 30 శాతం ఆదాయూన్ని సీజీఎఫ్ కింద ప్ర భుత్వం తీసుకోకుండా మొత్తం ఆదాయూన్ని ఆలయూభివృద్ధికి వినియోగిస్తే బాగుటుందని భక్తులు కోరుతున్నారు. డార్మెటరీ గదుల నిర్మాణం చేపడితే స్వామివారి సన్నిధిలో 11రోజులు, 21 రోజులు ఉండి పూజలు చే సుకునేందుకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. స్వాగతతోరణంతోపాటు, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారి నుం చి భూములు స్వాధీనం చేసుకుని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

అంజన్నకు మంత్రుల తాకిడి..
హనుమాన్ పెద్ద జయంతి పురస్కరిం చుకుని ఈ నెల 10న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, 11న ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, 12న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రానున్నారు. జయంతి సందర్భంగా వస్తున్న మంత్రులు, ఎంపీ కొండగట్టు ఆలయ అభివృద్ధికి వరాల జల్లులు కురిపిస్తారనే ఆశతో భక్తులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు