కొత్త సంవత్సరంలో వాటి ఉనికి కనుమరుగు

1 Jan, 2020 08:18 IST|Sakshi
అమ్మకానికి దుకాణంలో సిద్ధంగా ఉన్న చిన్న కార్డులు

సాక్షి, కెరమెరి(ఆసిపాబాద్‌): కొత్త సంవత్సరం వస్తోందంటే వారం పది రోజుల ముందు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో గ్రీటింగ్‌కార్డులు, రంగుల దుకాణాల వద్ద సందడి నెలకొని ఉండేది. ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రీటింగ్‌కార్డులు కొనుగోలు చేసి వారం ముందే పోస్టుల్లో పంపేవారు. అందుబాటులో ఉన్నవారికి స్వయంగా ఇచ్చేవారు. గ్రామీణప్రాంతాల్లో హీరో, హీరోయిన్ల ఫొటోలతో కూడిన గ్రీటింగ్స్‌కు మంచి గిరాకీ ఉండేది. నచ్చిన హీరో, హీరోయిన్ల ఫొటోలను మార్చుకుంటూ చిన్నారులు సంబురంగా గడిపేవారు. కానీ.. నేడు పరిస్థితి మారింది. గ్రీటింగ్‌కార్డులు కనుమరుగయ్యాయి. వాటికి గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు కూడా వాటి వైపు కన్నెత్తిచూడడం లేదు. 

కొత్తొక వింత..
కొత్తొక వింత.. అన్నచందంగా ఆత్మీయులను కలిసి శుభాకాంక్షలు తెలుపుకునే అలవాటు నుంచి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా క్షణాల్లో శుభాకాంక్షలు తెలుపుకునే సాంకేతిక పరిజ్ఞానం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈ మెయిల్స్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. సందేశాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో విభిన్నరకాల గ్రీటింగ్‌ స్టిక్కర్లతో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. 

ట్రెండ్‌ మార్చిన సెల్‌పోన్లు..
సెల్‌ఫోన్‌ల ప్రవేశంతో పాతట్రెండ్‌ మారింది. మెసేజ్‌లతో మొదలు.. ఫేస్‌బుక్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. గతంలో వేడుకలు ఎక్కడో ఓ చోట.. అన్నట్లు చేసుకునేవారు. ఇప్పుడు పూర్తిగా ట్రెండ్‌ మారింది. కాలనీలు మొదలుకుని.. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్‌లు కట్‌ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కాలంతోపాటు ఆధునిక పోకడలూ రంగప్రవేశం చేశాయి. సమయాభావం వల్ల యువత ఆత్మీయ సంభాషణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒక్క క్లిక్‌తో ఆత్మీయ, మిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

జ్ఞాపకాలుగానే పాత రోజులు
పాతకాలంలో కార్డుల ద్వారా గ్రీటింగ్‌ తెలుపుకునేవాళ్లం. వారం ముందు నాకు మిత్రులు పోస్టుకార్డు ద్వారా గ్రీటింగ్‌ పంపేవారు. దగ్గరున్న వారికి స్వయంగా శుభాకాంక్షలు తెలుపుకునేవాళ్లం. ఇప్పుడు          గ్రీటింగ్‌కార్డులకు గిరాకీ బాగా  తగ్గింది.  – కోటగిరి, సత్తయ్య, కెరమెరి 

ఇంటర్నెట్‌ ద్వారానే గ్రీటింగ్‌
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది. నిత్యం మిత్రులు, బంధువులతో చాటింగ్‌లు ఉంటాయి. సందర్భం ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ఫేస్‌బుక్‌ ద్వారానే కనెక్ట్‌  అవుతున్నారు. ఇప్పటికే నూతన వత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఎన్నో రకాలైన గ్రీటింగ్స్, స్టిక్కర్స్‌లను డౌన్‌లోడ్‌ చేశాం.  – పురి రమేశ్, కెరమెరి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చరితారెడ్డిపై విధి చిన్నచూపు..

నేటి ముఖ్యాంశాలు..

కొత్త సీఎస్‌.. సోమేశ్‌కుమార్‌

నుమాయిష్‌ ఓకే..

ఉల్లిపాయ కోసం గొడవ

ప్రగతి మాట...పల్లెబాట

తరగతి గదిలో ఆగిన టీచర్‌ గుండె

పంజగుట్ట ఠాణా ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం

పెట్రోల్‌ బంక్‌లో కారు దగ్ధం

నేడు తేలికపాటి వర్షాలు

నూతన లక్ష్యాలను పెట్టుకోండి: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత సంస్థా?

రండి.. రండి.. దయచేయండి!

అవినీతి ‘లెజెండ్‌’!

అర్బన్‌ ఫారెస్ట్‌ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత: ఎస్‌కే జోషి 

సంపూర్ణ అక్షరాస్యత

సరళాసాగర్‌కు గండి!

మాంద్యంలోనూ నిధుల వరద!

తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా..! 

వడివడిగా టీఆర్‌ఎస్‌ అడుగులు..

ఆ అధికారం మున్సిపల్‌ డైరెక్టర్‌కు..

స్కూల్‌ విద్యార్థిని చిదిమేసిన లారీ

టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటా: ఉత్తమ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

నుమాయిష్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్‌ కుమార్‌

షేక్‌పేట్‌ పెట్రోల్‌ బంక్‌లో అగ్నిప్రమాదం

ఈఎస్‌ఐ స్కాం: తవ్వేకొద్దీ దేవికారాణి అక్రమాలు

‘కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది

వేసవి బరిలో.. .

పార్టీ మూడ్‌

ముందుగానే ‘అల.. వైకుంఠపురములో..’?

పాటల మ్యాజిక్‌: వింటూ మైమరిచిపోదాం..

‘1.5 మిలియన్‌ వ్యూస్‌.. లక్ష లైక్స్‌’