రిజిస్ట్రేషన్లలో నోటరీలకు స్వస్తి!

21 Apr, 2017 02:04 IST|Sakshi

మున్సిపాల్టీల్లో మార్టిగేజ్‌ రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఇచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ
సాక్షి, హైదరాబాద్‌: పురపాలక సంఘాల్లో భూమి/భవ నాల తనఖాకు సంబంధించి నోటరీలు చెల్లవని రిజిస్ట్రే షన్ల శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2013 డిసెంబర్‌లోనే ఉత్తర్వులిచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయం తగ్గడానికి ఇది కూడా కారణమని గ్రహించిన ఉన్నతాధికారులు తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఏ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ నోటరీలను పరిగ ణలోకి తీసుకోవద్దని సబ్‌రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చారు. ఏదైనా భవన నిర్మాణానికి పురపాలక సంఘాల నుంచి అనుమతి తీసుకునేటప్పుడు నిబంధనల ప్రకారం 10 శాతం భూమి లేదా భవనాన్ని సదరు మున్సిపాలిటీకి మార్టిగేజ్‌ చేయాల్సి ఉంటుంది.

మార్టిగేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంప్‌డ్యూటీ రూ.5వేలతో పాటు మార్కెట్‌ వాల్యూలో 0.5శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. 2013కు ముందు భవన నిర్మాణ అనుమతి కోసం పురపాలక సంఘాలకు దరఖా స్తు చేసుకునే యజమానులు 10 శాతం భూమి/భవనాన్ని తనఖా పెట్టినట్లుగా నోటరీ చేయించేవారు. 2013 తరువాత కూడా ఇది కొనసాగించడం వల్ల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. దీంతో శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు