కొత్త డిస్టిలరీలకు అనుమతి వద్దు

6 Apr, 2016 03:11 IST|Sakshi
కొత్త డిస్టిలరీలకు అనుమతి వద్దు

కొత్త దరఖాస్తులు తిరస్కరించాలని ప్రభుత్వం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ఉత్ప త్తికి కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే కొత్తగా మూడింటికి అనుమతులివ్వడంతో పాటు కొన్నింటి సామర్థ్యం పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్టిలరీలు పూర్తిస్థాయి మద్యం ఉత్పత్తి చేస్తే పదేళ్ల వరకు ప్రజల అవసరాలకు సరిపోతుంది. ఈ క్రమంలో కొత్త అనుమతులు అవసరం లేదని ఆబ్కా రీ శాఖ కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణ యించినట్టు సమాచారం.

 30 కోట్ల లీటర్లకు చేరిన ఉత్పత్తి...
రాష్ట్రంలో ప్రస్తుతం 17 డిస్టిలరీలు ఉండగా వాటి ఉత్పత్తి సామర్థ్యం 17.55 కోట్ల లీటర్లు. 6నెలల కిందట ఎక్సైజ్ శాఖ ఇచ్చిన కొత్త డిస్టిలరీల నోటిఫికేషన్‌తో మద్యం ఉత్పత్తికి పలు కంపెనీలు ముందుకు రాగా, వాటిలో మూడింటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభిం చింది. ఎంఎస్ ఇం డస్ట్రీస్ 1.50 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తికి, ఆఫీసర్స్ చాయిస్ బ్రాండ్‌కు చెందిన అలకైట్ బ్లెండర్స్ 6.49 కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో డిస్టిలరీల ఏర్పాటుకు చేసుకున్న దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయి. కేడియా డిస్టిలరీస్ కంపెనీ కోటి లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయతలబెట్టిన డిస్టిలరీకి కూడా ఇటీవలే సర్కారు అనుమతిచ్చినట్లు సమాచారం.

ఇవి కాకుండా ఇప్పటికే మద్యం ఉత్పత్తి చేస్తున్న ఆర్.కె. డిస్టిలరీస్, రిజోమ్ డిస్టిలరీస్, ఏపీ మెట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలు అదనంగా మరో 3.96 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తికి అనుమతివ్వాలని చేసుకున్న దరఖాస్తుకు కూడా ప్రభుత్వం గ్రీన్      సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల సంఖ్య 20కి చేరగా, ఏటా సుమారు 30 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఏర్పడింది.

మరిన్ని వార్తలు