టీఆర్‌ఎస్‌ నేత హత్యపై ఈసీ స్పందన

6 Nov, 2018 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు నారాయణ రెడ్డి మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌కుమార్‌ మాట్లాడుతూ.. వికారాబాద్ రాజకీయ హత్యపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. (చదవండి : టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య)

వికలాంగులకు ఇబ్బందులుండవ్‌..
జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓ) సూచన మేరకు 10 -15 వేల వీల్క చైర్లు అందుబాటులో పెడతామని రజత్‌కుమార్‌ తెలిపారు. ఒక పోలింగ్‌ కేంద్రానికి 8 వీల్ చైర్ల వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. 
దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రవేశపెడతా. ‘వాదా’(ఓటర్ యాక్సెస్‌బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్) యాప్ సేవల్ని వినియోగించుకుంటామని అన్నారు. 

బదిరులకు ప్రత్యేక కరపత్రాలు ముద్రిస్తున్నామన్నారు. ఎన్నికల అధికారులందరికీ ప్రాథమిక సైన్ లాంగ్వేజ్‌పై అవగాహన కల్పించామని రజత్‌కుమార్‌ చెప్పారు. రెండు రోజుల్లో దివ్యాంగుల సహాయార్థం సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌ అందుబాటులోకి రానుందని రజత్‌కుమార్‌ వెల్లడించారు. మహిళా ఓటర్ల కోసం ఏర్పాటు చేసే పింక్‌ పోలింగ్‌ కేంద్రాల్లో పింక్‌ కలర్‌ను వాడబోమని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ఒక పింక్ స్టేషన్ ఉంటుందని అన్నారు.

మహబూబ్‌నగర్‌కు విజయ్‌ దేవర కొండ..
రాష్ట్ర ఎన్నికల ఐకాన్‌గా సానియా మీర్జా, పుల్లెల గోపిచంద్, వీవీఎస్ లక్ష్మణ్, గోరేటి వెంకన్న, అభినయ శ్రీ ( హీరోయిన్), ఆంజనేయులు, మహేంద్ర ( క్రికెటర్), శ్రావ్య ( సింగర్), సుజాత ( టీవీ యాంకర్ ), బాబు నాయక్ (శాస్త్రవేత్త) ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఎన్నికల ఐకాన్లు ఉంటారని రజత్‌కుమార్‌ తెలిపారు. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్‌ జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని తెలిపారు. పింక్ పోలింగ్ కేంద్రాలలో పింక్ కలర్ ఉండదు.

మరిన్ని వార్తలు