ఆఖరి మజిలీకీ అవస్థలే !

6 Sep, 2019 10:42 IST|Sakshi
పొలాల మధ్య నుంచి అంతిమయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

సాక్షి, నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి):  శ్మశానవాటికకు సరైన దారిలేక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పెద్దఆత్మకూర్, చిన్నఆత్మకూర్‌ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా చనిపోతే పాడెను పంటపొలాల ఒడ్లపై నుంచి అవస్థలు పడుతూ శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పెద్దఆత్మకూర్‌ గ్రామానికి చెందిన నాయికోటి రాములు అలియాస్‌ దుబాయి రాములు అనారోగ్యంతో గురువారం మృతి అదే పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు.

మరిన్ని వార్తలు