'తెలంగాణలో మహిళలకు రక్షణ కరవు'

21 May, 2016 18:01 IST|Sakshi

నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని డీసీసీ అద్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శనివారం మెదర్ జిల్లాలోని నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రధానంగా దళిత మహిళలకు రక్షణ లేదన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినపుడు టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు బాధితులను పరామర్శించకపోవడం విచారకరమన్నారు. శివ్వంపేట మండలంలోని పోతారంకు చెందిన దళిత మహిళపై అత్యాచారం జరిగి నెలలు గడుస్తున్నా ఆమెకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం అందలేదని సునీతారెడ్డి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి నర్సాపూర్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పరామర్శించలేదన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి పునరావృతం కావని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు