పోలింగ్‌ కేంద్రాల్లో నో సెల్ఫీ

21 Nov, 2018 09:00 IST|Sakshi

సాక్షి, కాజీపేట: సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ వయస్సు తారతమ్యం లేకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతిఒక్కరిలో సెల్ఫీల పిచ్చి నానాటికీ పెరుగుతుంది. పోలింగ్‌కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడడం లేదు కదా అని సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్‌ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం.

ఓటరు నిబంధనలకు విరుద్ధంగా చూపిస్తూ ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. రూల్‌నంబర్‌ 49 ఎన్‌ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకున్ని Ððవెంట తీసుకొని వెళ్లవచ్చు. సహాయకుడు అతడి ఓటును బహిరంగపర్చనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు