నో స్టాప్‌..!   

27 Aug, 2018 15:27 IST|Sakshi
భువనగిరి రైల్వే స్టేషన్‌

భువనగిరి రైల్వే స్టేషన్‌లో ఆగని  పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

నిత్యం వందలాది మంది రాకపోకలు

ప్రయాణానికి తప్పని తిప్పలు

రైల్వే అధికారుల దృష్టికి  తీసుకెళ్లినా స్పందన కరువు

భువనగిరి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్‌నుంచి వందలాది మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్లు ఆగకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ప్రయాణం రద్దు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన టికెట్‌లతో నష్టపోవాల్సి వస్తోంది. పద్మావతి, శాతవాహన, షిరిడీ, ఎల్‌టీడీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలపాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ఆ శాఖ అధికారులనుంచి స్పందన కరువైంది.

భువనగిరి మీదుగా వెళ్లే రైళ్లు..

 ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్‌ మీదుగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌(హైదరాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌), కృష్ణా, కొలహాపూర్‌ ఎక్స్‌ప్రెస్, ప్యాసిం జర్‌(ఫలక్‌నమా నుంచి భువనగిరి), ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌(సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు), కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌(సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌), ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(హైదరాబాద్‌ నుంచి హౌరా), పుష్‌పుల్‌ ప్యాసింజర్‌ (హైదరా బాద్‌ నుంచి వరంగల్‌), గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌నుంచి గుంటూరు), ప్యాసిం జర్‌(ఫలక్‌నామానుంచి జనగాం), భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌ నుంచి బల్హార్షా), కాకతీయ ప్యాసింజర్‌(సికింద్రాబాద్‌ నుంచి మ ణుగూరు), పుష్‌ పుల్‌(హైదరాబాద్‌ నుంచి కాజీ పే ట), గౌతమి(లింగంపల్లి నుంచి కాకినాడ), దక్షిణ ఎక్స్‌ప్రెస్‌(హైదరాబాద్‌ నుంచి నిజాముద్దీన్‌) రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట వైపు రాకపోకలు సాగిస్తుంటాయి. 

ఆగని రైళ్లు..

భువనగిరి రైల్వే స్టేషన్‌ నుంచి నిత్యం సుమారు 2,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో సుమారు 500 మంది ప్రతి రోజూ హైదరాబాద్‌లో ఉద్యోగ నిమిత్తం వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం భువనగిరి మీదగా వివిధ రకాల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో శాతవాహన, పద్మావతి, షిరిడీ, ఎల్‌టీడీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ  ఆగడం లేదు. కాజీపేట వైపు, సికింద్రాబాద్‌ వైపు వెళ్లేటప్పడు గానీ ఈ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

తక్కువ వ్యవధిలో రైళ్లు లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన వస్తుంది. ఉదయం కాజీపేట వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9.17 నిమిషాలకు ఉంటే ఆ తర్వాత గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ 12.04 గంటలకు, ఆ తర్వాత ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 3.57 గంటలకు రైలు ఉంది. దీంతో ఈ రైళ్ల రాకపోకల మధ్య సుమారు 3నుంచి 4 గంటలు çసమయం పడుతుంది.ఈ సమయంలో వచ్చిన రైళ్లు రద్దీగా రావడంతో ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్ల బుక్‌ చేసుకున్న టికెట్లను నిత్యం 50నుంచి 70 వరకు రద్దు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో  టికెట్లు రద్దు చేసుకున్న సమయం దాటిపోవడంతో  ప్రయాణికులు నష్టపోతున్నారు. భువనగిరి స్టేషన్‌ నుంచి షిరిడీ, తిరుపతికి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో షిరిడీ, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. 

కేంద్ర మంత్రిని కోరాం

భువనగిరి రైల్వే స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్లతో పాటు పద్మావ తి, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను నిలపాలని సంబంధిత కేంద్ర మంత్రిని కోరాం. ఇప్పటికే సికింద్రాబాద్‌ రైల్వే జీఎం కూడా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలపటానికి సంబంధించిన నివేధిక కూ డా ఉన్నతాధికారులకు పంపించారు. రైల్వే స్టేషన్‌లో కనీసం రెండు రైళ్లన్న నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    –డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, ఎంపీ 

మరిన్ని వార్తలు