చక్కెరకు జీఎస్టీ పన్ను పోటు వద్దు

26 Oct, 2016 02:30 IST|Sakshi
చక్కెరకు జీఎస్టీ పన్ను పోటు వద్దు

మంత్రి ఈటలకు షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

 సాక్షి, హైదరాబాద్: చక్కెర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి ఈటలతో భేటీ అయ్యారు. జీఎస్టీ అమలవనున్న నేపథ్యంలో చక్కెరపై పన్నులు విధిస్తే నేరుగా చెరుకు పండించే రైతులపై ఏ మేరకు భారం పడుతుందనే కోణంలో చర్చించారు. చక్కెర వినియోగంలో భారత్ మొదటిస్థానంలో, తయారీలో రెండోస్థానంలో ఉందని గుర్తు చేశారు.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగంపై జీఎస్టీ పన్ను పోటు లేకుండా చూడాలని అసోసియేషన్ అధ్యక్షుడు సరితారెడ్డి, కార్యదర్శి భలేరావు విజ్ఞప్తి చేశారు. చక్కెర పరిశ్రమను 6 శాతం పన్నుల కేటగిరీలోకి తీసుకురావాలని, ఇథనాల్ తయారీపై ఎలాంటి వడ్డింపులు లేకుండా చూడాలని పరిశ్రమల ప్రతినిధులు కోరారు.

>
మరిన్ని వార్తలు