టోల్‌ రుసుం లేనట్టే..!

26 Mar, 2020 12:28 IST|Sakshi
గూడూరు టోల్‌ప్లాజా వద్ద పోలీస్‌ బందోబస్తు, నిర్మానుష్యంగా ఎన్‌హెచ్‌ –65

ఫ్రీగా వాహనాలను వదులుతున్న టోల్‌ సిబ్బంది

ఆదేశాలు జారీ చేసిన నేషనల్‌ హైవే అధికారులు

నేడు వెలువడనున్న ప్రకటన

యాదాద్రి భువనగిరి, బీబీనగర్‌ : కరోనా వైరస్‌ నిరోదక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా గుండా మంగళవారం రాత్రినుంచి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు. రుసుం తీసుకోవద్దంటూ నేషన్‌ హైవే అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక టోల్‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో మంగళవారం నుంచి వా హనాలనుంచి రుసుం తీసుకోకుండా వదులు తున్నట్లు అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు అన్ని టోల్‌ప్లాజాల గుండా వాహనాలను ఉచితంగా వదిలేలా నేషనల్‌ హైవే అధికారులు నేడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాలు తగ్గుముఖం పట్టడం, ఫ్రీగా  వదులుతుండడంతో టోల్‌ సిబ్బందిని ఇళ్లకు పంపించారు. కేవలం ఇరువైపులా రెండు బూత్‌లను మాత్రమే తెరిచి ఉంచగా మిగితా కౌంటర్లను మూసివేశారు. 23వ తేదీన 10,650 వాహనాలు వెళ్లగా, 24న 3,880, 25న 1,650వరకు వాహనాలు గూడూరు టోల్‌ గుండా వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య తగ్గిపోతుండడంతో టోల్‌ రుసుంను మినహాయిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు