వేతనం లేని చైర్మన్

16 Aug, 2016 01:44 IST|Sakshi
వేతనం లేని చైర్మన్

ఎన్పీడీసీఎల్ సీఎండీకి రెండేళ్లుగా వేతనం నిర్ణయించని  ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) అత్యుతన్నత అధికారికి రెండేళ్లుగా వేతనం లేదు. ఎన్పీడీసీఎల్ చైర్మన్(సీఎండీ) కి నెలవారీగా ఎంత వేతనం చెల్లించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటింది. ఇప్పటికీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వేతనం ఎంతనేది ఇప్పటికీ నిర్ణయించలేదు. తెలంగాణలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఎన్పీడీసీఎల్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కరెంటు సరఫరా ప్రక్రియను నిర్వహిస్తోంది.

5,612 గ్రామాల్లో వ్యవసాయ, గృహ అవసరాలకు కరెంటు సరఫరా చేస్తోం ది. ఈ సంస్థ పరిధిలో 51.21 లక్షల వ్యవసా య, గృహ, పారి శ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. అన్ని స్థాయిల ఉద్యోగులు కలిపి 8,249 మంది ఎన్పీడీసీఎల్‌లో ఉన్నారు. వేల కోట్ల వార్షిక టర్నోవరుతో దశాబ్దాలుగా సంస్థ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఆగస్టు 5న ఎన్పీడీసీఎల్ సీఎండీగా కె.వెంకటనారాయణ నియమితులయ్యారు. సీఎండీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వేతనం ఎంత అనేది నిర్ణయించలేదు. దీంతో నియామకమై రెండేళ్లు గడిచినా సీఎండీ వేతనం తీసుకోవడం లేదు. ఇదే విషయంపై పలుసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఎలాంటి స్పందనా రాలేదని ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు