శబ్ద కాలుష్యంతో హైబీపీ, కేన్సర్‌! 

4 May, 2020 02:35 IST|Sakshi

జర్మనీ మెడికల్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : పెద్ద పెద్ద శబ్దాలు, వాటితో ఏర్పడే శబ్ద కాలుష్యం వల్ల హైబీపీ, కేన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పెద్ద శబ్దాలు, ఎయిర్‌పోర్టుల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ అప్పుడు వచ్చే ధ్వని వంటివి జన్యువుల (కేన్సర్‌ సంబంధిత డీఎన్‌ఏల్లో) మార్పులకు కారణం కావొచ్చు. ఈ శబ్దాలు, వాయు కాలుష్యం మనుషుల్లో అధిక రక్తపోటు (హైబీపీ), కేన్సర్‌ కారక కణతులు ఏర్పడటానికి, అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.

పెద్ద శబ్దాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది తెలుసుకునేందుకు ఎలుకలపై జర్మనీలోని ‘యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ ఆఫ్‌ మెయింజ్‌’ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి. కేవలం 4రోజు లు కూడా విమానాల శబ్దాలను ఎలుకలు తట్టుకోలేకపోయాయని, వాటిలో హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో పా టు వాటి కేన్సర్‌ అభివృద్ధికి కారణమయ్యే డీఎన్‌ఏ డ్యామేజీకి దారితీసినట్టుగా గుర్తించారు. ‘మా అధ్యయనం ద్వారా వెల్లడైన సమాచారం లోతైన విశ్లేషణకు ఉపయోగపడతాయి’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన మథాయాస్‌ ఉల్జే వెల్లడించారు. ఈ పరిశోధన పత్రాలను ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సొసైటీస్‌ ఫర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ బయాలజీ  జర్నల్‌లో ప్రచురించారు.  చదవండి: కుక్కలకు భయపడి.. చిరుత చెట్టెక్కింది! 

మరిన్ని వార్తలు