‘ఇంట్రావిలేజ్‌’లో ఇతర రాష్ట్రాలకు అవకాశం

19 Apr, 2017 02:24 IST|Sakshi
‘ఇంట్రావిలేజ్‌’లో ఇతర రాష్ట్రాలకు అవకాశం

మిషన్‌ భగీరథపై సమీక్షలో వైస్‌చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ఇంట్రా విలేజ్‌ పను లు చేయడానికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని,రాష్ట్రంలో కాంట్రాక్టర్ల కొరత ఉన్న సెగ్మెంట్లలో వారికి అవకాశం కల్పించా లని ప్రభుత్వం భావిస్తోందని మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇంట్రా విలేజ్‌ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చిం చారు.ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్‌ నాటికి ప్రతి ఆవాసానికి సురక్షిత మంచినీటి ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నందున, స్థానిక కాంట్రాక్టర్లతో పాటు మిగతా రాష్ట్రాల వారికీ అవకాశం కల్పిస్తామన్నారు.

ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్ల అర్హతలు, గతంలో చేసిన పనులను తెలుసుకోవడానికి బిహార్, ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో పర్యటించేందుకు కన్సల్టెంట్ల బృందాన్ని పంపాలని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ను ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. కాంట్రాక్టర్ల రిజి స్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన... ఇంట్రా పనులు ప్రారంభమై 45 రోజులవు తున్నా ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణాలు ఊపందు కోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాత నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇంట్రా పనుల ఆలస్యం, కాంట్రాక్టర్లు తగినంత లేకపోవడానికి సంబంధిత చీఫ్‌ ఇంజనీర్‌ వైఫల్యమే కారణమంటూ ప్రశాంత్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు