కేటీఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు మా నోటీసులు అందజేయండి

18 Aug, 2015 01:12 IST|Sakshi
  •  తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయానికి ఏపీ సీఐడీ లేఖ
  •  సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్‌మెన్ జానకీరామ్, డ్రైవర్ సత్యనారాయణలకు జారీ చేసిన నోటీసులను ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ) కార్యాలయంలో అందించారు. ఆ విభాగం ఇన్‌చార్జిగా ఉండే ఐజీ పేరుతో లేఖ రాసిన అధికారులు ఈ నోటీసులను సంబంధిత వ్యక్తులకు అందజేయాల్సిందిగా కోరారు. తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ నుంచి జవాబు వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ఏపీ సీఐడీ నిర్ణయించింది.

    ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డికి తెలంగాణ ఏసీబీ నుంచి నోటీసు జారీ కావడంతో ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులను సిద్ధం చేశారు. వీటిని వారిద్దరికి అందజేయడానికి బుధవారం రాత్రి బేగంపేటలోని తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం, నందిహిల్స్‌లోని కేటీఆర్ నివాసం, ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ) ఆఫీస్‌లకు వెళ్లారు.

    అక్కడ వారి ఆచూకీ లభించకపోవడంతో సీఐడీ అధికారులు గురువారం కరీంనగర్‌కు వెళ్లారు. అక్కడ కూడా వీరిద్దరి ఆచూకీ లభించకపోవడం, శుక్రవారంతో నోటీసుల గడువు ముగియడంతో సీఐడీ అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. శనివారం జానకీరామ్, సత్యనారాయణ పేర్లతో మళ్లీ నోటీసులను రూపొందించారు. వీటిని ఆదివారం ఖైరతాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో అందించారు.
     

మరిన్ని వార్తలు