టెస్కాబ్, మార్క్‌ఫెడ్‌ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌

3 Mar, 2020 02:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌), రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (మార్క్‌ఫెడ్‌) మేనేజింగ్‌ క మిటీకి ఎన్నికల కోసం సోమ వారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేష న్‌ విడుదల చేసింది. దీని ప్రకారం టెస్కాబ్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 5న, మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ మేనేజింగ్‌ కమిటీ డైరెక్టర్ల ఎన్నిక ఈ నెల 10న జరగనుంది. ఇక మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ ఎన్నిక 11న జరగనుంది. 5న ఉదయం 9 నుంచి 11 గంటల వ రకు టెస్కాబ్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్లకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11.30 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదేరోజు మధ్యా హ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఉపసంహరణ అనంతరం ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవమైనట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. కాగా, డీసీసీబీ చైర్మన్లంతా టెస్కాబ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లుగా ఉంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఎ న్నుకుంటారు. ఇక తెలంగాణ సహకార మార్కె టింగ్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ ఎన్నికకు సంబంధించి 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు సాయంత్రం ఐదు గంటల వరకు సమ యం ఇచ్చారు. ఈ నెల 10న ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. ఆపై ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. పీఏసీఎస్‌S అధ్యక్షులు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల అధ్యక్షులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ నెల 11న రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు