దూరవిద్యలో ఎంఈడీ, బీఈడీ

4 May, 2014 00:45 IST|Sakshi

ఎదులాపురం, న్యూస్‌లై న్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఈడీ, బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో 2014 సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ సహాయ సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈడీ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు బీఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, 1 జూలై, 2014 నాటికి 23 సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు.

బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, 1 జూలై 2014 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను ఏపీ ఆన్‌లైన్ కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవడానికి ఈనెల 31 చివరి గడువు అని పేర్కొన్నారు. ఎంఈడీ పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు రూ.535, బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్షలకు రూ.435 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జూన్ 22న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎంఈడీ, బీఈడీ అర్హత పరీక్షలు ఉంటాయని, బీఈడీ స్పెషల్ అర్హత పరీక్ష జూన్ 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్ 08732-221016లో సంప్రదించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు