66 ఉర్దూ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌

30 Mar, 2018 02:23 IST|Sakshi
ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ షుకూర్‌

ఏప్రిల్‌ 2 నుంచి 23 వరకు దరఖాస్తులు

ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ షుకూర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు సీఎం కార్యాలయంలో 66 ఉర్దూ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేçషన్‌ విడుదల చేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌ఎ.షుకూర్‌ గురువారం విలేకరులకు తెలిపారు. గ్రేడ్‌–1 పోస్టులకు రూ.600, గ్రేడ్‌–2 పోస్టులకు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 2 నుంచి 23 వరకు ఉంటుందన్నారు. వివరాలకు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు  జ్టి్టp:// ఠీఠీఠీ.్టటu్చ.జీn/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.  

ఆరు గ్రేడ్‌–1 పోస్టులు.. 
వీటిలో గ్రేడ్‌–1 పోస్టులు ఆరు ఉన్నాయి. విద్యార్హత ఎస్సెస్సీలో ఉర్దూ రెండో భాషగా ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీలో ఉర్దూ ఓ సబ్జెక్ట్‌గా ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21–44 మధ్య ఉండాలి. వేతనం కింద రూ.37,100 నుంచి రూ.91,450 చెల్లిస్తారు. 

గ్రేడ్‌–2 పోస్టుల అర్హతలు..
గ్రేడ్‌–2 విభాగంలో 60 ఉర్దూ ఆఫీసర్ల పోస్టులు ఉన్నాయి. విద్యార్హత ఎస్సెస్సీలో ఉర్దూ రెండో భాషగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా డిగ్రీలో ఉర్దూ ఓ సబ్జెక్ట్‌గా ఉండాలి. వయస్సు 21–44 మధ్య ఉండాలి. వేతనం కింద రూ.28,940 నుంచి రూ.78,910 చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు