మేనేజ్‌మెంట్‌ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

29 Jun, 2018 02:28 IST|Sakshi

30 నుంచి దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీ, సీ(ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ సీట్లను ఈ నోటి ఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన ఓ ప్రకట నలో పేర్కొన్నారు. నీట్‌ ర్యాంకు ఆధారంగానే యూనివర్సిటీ సీట్లను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం ఈ నెల 30 నుంచి జూలై 5న సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

6న మెరిట్‌ జాబితా తయారు చేస్తామన్నారు. వివరాలను www.knruhs.inలో పొందవచ్చని సూచించారు. కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో ఏవైనా సమస్యలుంటే వెబ్‌సైట్‌లోని ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు. కౌన్సెలింగ్‌ సమయంలో ఏదైనా కాలేజీకి అదనంగా సీట్లు వస్తే వాటిని కూడా ఇదే నోటిఫికేషన్‌ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ సీట్లను కూడా నీట్‌ మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేస్తామని వెల్లడించారు. 

రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య విద్య కళాశాలల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం(26న)తో ముగిసింది. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ ఆధారంగా తాత్కా లిక మెరిట్‌ జాబితాను, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తర్వాత నీట్‌ మెరిట్‌ ఆధారంగా తుది మెరిట్‌ జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించనున్నామన్నారు. ఇందుకు హైదరాబాద్, వరంగల్‌ రెండు ప్రాంతాల్లో 5 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాప్‌(ఆర్మీ), నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎన్‌సీసీ), స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్, అంగవైకల్యం, పోలీస్‌ మార్టి ర్స్‌ చిల్డ్రన్‌ (పీఎంసీ) తదితర ప్రత్యేక కేటగిరీల్లో దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, నాన్‌ లోకల్‌ అభ్యర్థుల కు జేఎన్‌టీయూ, కూకట్‌పల్లిలో సెంటర్‌ ఏర్పాటు చేశా మన్నారు. పూర్తి సమాచారాన్ని  www.knruhs.inలో చూడొచ్చని వెల్లడించారు. 

జేఎన్‌టీయూలో స్పెషల్‌ కేటగిరీ, నాన్‌ లోకల్‌ అభ్యర్థుల షెడ్యూల్‌... 
30.6.18– క్యాప్‌ (ఆర్మీ), స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్స్‌కు. 
01.7.18– ఎన్‌సీసీ, అంగవైకల్యం గల వారికి. 
02.7.18 నుంచి 4 వరకు– నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు.  

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కేంద్రాలు ఇవే... 
జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌ 
డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ 
ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూరవిద్య కేంద్రం,ఓయూ క్యాంపస్, హైదరాబాద్‌ 
ఏవీ కాలేజీ, దోమల్‌గూడ, గగన్‌మహల్, హైదరాబాద్‌ 
నిజాం కాలేజీ, బషీర్‌బాగ్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు