ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

22 Jun, 2019 02:28 IST|Sakshi

మెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ మొదలు 

నేటి నుంచి 28 వరకు దరఖాస్తు గడువు

29 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య విద్య కోర్సుల్లో 2019–20 విద్యా ఏడాదికి ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్‌ అమలు ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవే టు, మైనారిటీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. వర్సి టీ వెబ్‌సైట్‌ ( www. knru hs.in & http://www. knruh s.telan gana.g ov.in) దరఖాస్తు చేసుకోవాలని వీసీ కరుణాకర్‌రెడ్డి సూచించారు. కాగా, 22 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ఆధారంగా 28 రాత్రి ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు. 29 నుంచి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. తుది జాబితా విడుదల చేసి సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నా రు. దరఖాస్తు సమయంలో సమస్యలు తలెత్తితే 9502001583, 8466924522 నంబర్ల లో సంప్రదించాలని, నిబంధనల సమాచారం కోసం 9490585796, 8500646 769 నంబర్లలో సంప్రదించవచ్చు. అఖిల భారత కోటా సీట్లలో చేరేందుకు జూలై 3 చివరి తేదీ కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసినవారు ఆ లోపే వెరిఫికేషన్‌ చేయించు కోవాలని సూచించారు. 

కన్వీనర్‌ కోటాలో 2,880 ఎంబీబీఎస్‌ సీట్లు.. 
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద మొత్తం 2,880 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడి కల్‌ కాలేజీల్లో నేషనల్‌ పూల్‌కు 15% సీట్లు పోగా 1,275, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 1,275 సీట్లు, మైనారిటీ కాలేజీల్లో 330 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని వివరించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 200 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇవన్నీ కలిపితే 3,080 ఎంబీబీఎస్‌ సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ కానున్నాయి. ప్రైవేటు, మైనారిటీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లల్లో 50% కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. 

మరిన్ని వార్తలు