మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు..

25 Nov, 2019 03:37 IST|Sakshi
మెట్రో రైలులో ప్రయాణిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

29న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు ప్రయాణించనుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్‌–3లో భా గంగా నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు ఇక మె ట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తుతం ఈ మార్గం లో హైటెక్‌ సిటీ వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కి.మీ మేర అన్ని పనుల పూర్తితో పాటు రైల్వే సేఫ్టీ అనుమతులు రావడంతో 29న రైలు చివరి పాయింట్‌ వరకు చేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26, 27 తేదీల్లో మెట్రోరైల్‌ సేఫ్టీ అధికారి జనక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మరోసారి రైళ్లను పరిశీలించి 29న ప్రారంభిస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.

భార్యతో కలిసి మంత్రి మెట్రో జర్నీ
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి ఎర్రమంజిల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. బంధువు ల వివాహానికి ఆయన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లా డి సౌకర్యాల గురించి వాకబు చేశారు. అనంతరం ఎన్వీఎస్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతూ..  సమ యం ఆదాతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న మెట్రో సిబ్బందిని అభినందించారు.

మరిన్ని వార్తలు