నౌహీరా షేక్‌ బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు

14 Nov, 2018 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే అభియోగాల కేసులో హీరా గ్రూప్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నౌహీరా షేక్‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దుచేసింది. వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ బెయిల్‌ను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

సీసీఎస్‌ పోలీసులు ఆమెపై నమోదు చేసిన కేసులో హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి షరతులతో బెయిల్‌ ఇచ్చారు. బెయిల్‌ను రద్దు చేయా లని సీసీఎస్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉండగానే బెయిల్‌ మంజూరైందని, ఆమె బయటకు వస్తే కోట్లాది రూపాయల అక్రమాల అభియోగాల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి వాదనల్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు.

మరిన్ని వార్తలు