కువైట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

26 Sep, 2014 17:42 IST|Sakshi
కువైట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కువైట్ తెలంగాణ సమితి (కేటీఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఇప్పటివరకు గల్ఫ్ దేశమైన కువైట్లో ఎప్పుడూ ఈ ఉత్సవాలు చేసుకోలేదని, భారత్లో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా ఈ ఉత్సవాలు చేసుకోవడం ఆనందంగా ఉందని కువైట్లో భారత రాయబారి సునీల్ జైన్ అన్నారు. తెలంగాణ ప్రవాసీయులలో ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగిందని, అందుకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలే నిదర్శనమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లోని తెలంగాణ ప్రాంతీయులు కూడా బాగా స్పందిస్తున్నారని ఆయన అన్నారు. స్వీయ అస్తిత్వం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ కళలు, సంస్కృతి ప్రధాన పాత్ర పోషించాయని, అందులో భాగంగానే ఇప్పుడు ఎడారి ప్రాంతాలకు కూడా బతుకమ్మ ఉత్సవం పాకిందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ముత్యాల వినయ్, రంజిత్, చెల్లంశెట్టి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు