ఎన్టీపీసీ పీటీఎస్‌లో భారీ చోరీ

29 Nov, 2014 03:52 IST|Sakshi
ఎన్టీపీసీ పీటీఎస్‌లో భారీ చోరీ

37 తులాల బంగారు నగలు అపహరణ

జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని పలు క్వార్టర్లలో గురువారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. నున్న వెంకటశ్రీనివాసరావు ఇంట్లో 37.5 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మరో ఉద్యోగి రవికుమార్‌కు చెందిన క్వార్టర్ తలుపు తాళాలు పగులగొట్టారు. రవికుమార్ స్థానికంగా లేకపోవడంతో ఇంట్లో ఏ వస్తువులు పోయూయో తెలియలేదు.

రవికుమార్ క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వెంకట శ్రీనివాసరావు కెమికల్ ఇంజినీరింగ్‌గా ఎన్టీపీసీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇటీవల విశాఖపట్నం సింహాద్రి ప్రాజెక్టు నుంచి రామగుండం ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు. ప్రాజెక్టు పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని సీ-12/44లో కుటుంబసభ్యులతో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల హైదరాబాద్‌లోని సోదరుని ఇంటికి కుటుంబసభ్యులతో వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో లైటు వెలిగి ఉండడంతో స్థానికులు గమనించి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలాన్ని రామగుండం సీఐ నారాయణ సందర్శించారు. కరీంనగర్‌కు చెందిన క్లూస్ టీం సభ్యులు రాంప్రసాద్, స్వర్ణజ్యోతి, కనకయ్య  ఆధారాలు సేకరించారు.

బాధితుడు శ్రీనివాస్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పర్మినెంట్ టౌన్‌షిప్ హైసెక్యూరిటీ జోన్‌లో ఉంది.  రెండు వైపులా ఉన్న గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది కాపలా, సీసీ కెమెరాలున్నాయి. అరుునా చోరీ జరగడంపై ఉద్యోగులు ఆశ్చర్య వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు