ఖమ్మం: ‘పేట’లో పెరిగిన ఓటర్లు

4 Dec, 2018 12:46 IST|Sakshi
ఓటర్లు

సాక్షి, అశ్వారావుపేటరూరల్‌: ఎన్నికల ప్రక్రియలో ఓటు ఎంతో కీలకం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, ఎన్నికలో సంఘం ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు పొందే విధానం, దరఖాస్తు చేసుకునే అవకాశం పలు దఫాలుగా కల్పించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో తమ ఓటు ఉందో లేదో కుడా చూసుకునే వెసులుబాటు కుడా కల్పించింది. దాదాపు నెల రోజులపాటు జాబితాపె ఎన్నికల సంఘం, అధికారులు దృష్టి పెట్టడంతో ఎంతో వేలాది మంది తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో వేలమంది ఓటర్లు ఓటు హక్కు పొందారు.నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో గడిచిన నెల రోజులుగా పెరిగిన ఓటర్లు, తుది జాబిథౠను సైతం జిల్లా అధికారులు విడుదల చేశారు. దానిని పరిశీలిద్దాం. 


నియోజకవర్గంలో 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి 1,55,376 మంది ఓటర్లు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 1,64,419 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గం పరిధిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. దీంతో, దాదాపు 40వేల మంది ఓటర్లు తగ్గారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,24,419కి పడిపోయింది.  ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.అసెంబ్లీ రద్దు తర్వాత గడిచిన రెండు నెలల్లో నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 1,42,571కి చేరింది. తాజాగా ప్రకటించిన తుది జాబితా ప్రకారంగా ఈ సంఖ్య 1,43,960గా నమోదైంది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 1389 మంది కొత్త ఓటర్లు పెరిగారు. 

మరిన్ని వార్తలు