వైద్యుని దురుసు ప్రవర్తనపై ఆందోళన  

11 Jul, 2018 12:57 IST|Sakshi
రవీంద్రకుమార్‌ను నిలదీస్తున్న సిబ్బంది, స్థానికులు   

ఇచ్ఛాపురం: వైద్యుని దురుసు ప్రవర్తనపై విసిగివేశారిన స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సి బ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. ఇక్కడ అతనుంటే తాము విధులు నిర్వర్తించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇక్కడ డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా గత శనివారం డాక్టర్‌ అత్తోటి రవీంద్రకుమార్‌ విధుల్లోకి చేరారు. అప్పట్నుంచి రోగుల ఎదుట సదరు సిబ్బందిని ఇష్టానుసారంగా తిట్టడం, కొ ట్టడానికి చేయిఎత్తడం వంటి చేష్టలు చేస్తున్నారు.

నైట్‌ డ్యూ టీలను సక్రమంగా చేయనివ్వడంలేదని హెడ్‌ స్టాఫ్‌ శమంతకమణి, ఉమ, శైలజ, జ్యోతి, శారద, విద్య, ధనలక్ష్మి వాపోయారు. ఈ నేపథ్యంలో ఈయన వ్యవహార శైలి మార్చుకోవాలని వారి కుటుంబ సభ్యులు కూడా సదరు వైద్యుణ్ని హెచ్చరించారు.

అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఆసుపత్రి చైర్మన్‌ జగన్నాథంతోపాటు ఆసుపత్రి వైద్యాధికారి దామోదర్‌ప్రధాన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీసీహెచ్‌ఎస్‌ దృష్టికి తీసుకెళ్లామని, విధుల్లోకి చేరాలని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది శాంతించారు.

>
మరిన్ని వార్తలు