125 గజాల లోపు ఉచితంగా క్రమబద్ధీకరణ: కేసీఆర్

16 Dec, 2014 18:38 IST|Sakshi
125 గజాల లోపు ఉచితంగా క్రమబద్ధీకరణ: కేసీఆర్

హైదరాబాద్ నగరంలో 125 గజాల లోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా ఆయా భూములను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 250-300 గజాలలోపు నివాసం ఉంటున్న మధ్యతరగతి వారికి కొద్దిపాటి ధరతో క్రమబద్ధీకరిస్తామన్నారు. 500 గజాలలోపు నివాసం ఉండేవారికి 100 గజాలకు చొప్పున ధర పెంచుతూ క్రమబద్ధీకరణ చేస్తామన్నారు.

హైదరాబాద్ నగరంలో భూకబ్జాల దుకాణం బంద్ కావాలని, పేదలకు నీడ కల్పించేందుకు ఉదారంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. భూముల క్రమబద్ధీకరణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీల ముందు పలు ప్రతిపాదనలను కేసీఆర్ పెట్టారు. 500 గజాలపైన నివాసం ఉండేవారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి క్రమబద్ధీకరిస్తామన్నారు. 15 నుంచి 50 గజాల లోపు స్థలంలో ఎవరైనా నివాసం ఉంటుంటే, వారికి అదేచోట ఇల్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూముల క్రమబద్ధీకరణ కోసం అధికారులు, వివిధ పార్టీల నేతలతో కమిటీలు ఏర్పాటుచేస్తామన్నారు.

మరిన్ని వార్తలు