ఏసీబీ వలలో అవినీతి చేప

14 May, 2015 16:46 IST|Sakshi

హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండ కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణమూర్తి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హన్మకొండ పీఏసీఎస్ వైస్‌ చైర్మన్ కంకల సదానందం నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు. పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు సదానందంను కృష్ణమూర్తి రూ.2 లక్షలు లంచం అడిగాడు. సదానందం ఇంతకు ముందే రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.50 వేలు కూడా ఇచ్చేందుకు సదానందం సిద్ధమయ్యగా.. మరో పదివేల రూపాయలు అదనంగా ఇవ్వాలని కృష్ణమూర్తి డిమాండ్ చేయడంతో సదానందం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ పధకం ప్రకారం ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడ్ని జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు