'సీఎం చెప్పినట్లు అధికారులు వ్యవహరించడం లేదు'

21 Oct, 2014 11:13 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా... అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో శివశంకర్ మాట్లాడుతూ... ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా అధికారులు వ్యవహరించడం లేదని విమర్శించారు.  పథకాల అమలు కోసం ఉన్నతాధికారులు కింద స్థాయి సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని శివశంకర్ అభిప్రాయపడ్డారు.  
 

మరిన్ని వార్తలు