కుమురం భీం జిల్లాలో ఆయిల్‌ నిక్షేపాలు!

10 Jun, 2019 02:41 IST|Sakshi

ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్లుప్రాథమికనిర్ధారణ 

సిర్పూర్‌(టి): కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిసరప్రాంతాల్లో ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో నిపుణులు సర్వే చేస్తున్నారు. ఓఎన్‌జీసీఆధ్వర్యంలో చేపట్టిన ఈసర్వేలో కుమురంభీం జిల్లా పరిధిలో నికాగజ్‌నగర్, సిర్పూర్‌(టీ), దహెగాం, పెంచికల్‌ పేటమండలాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్లుగుర్తించారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ నిపుణుల ఆధ్వర్యంలో సర్వేపనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కేబుల్‌ కనెక్షన్లు వేసి అధునాతన పరికరాలతో చేస్తున్న సర్వే మొదటిదశపూర్తికావస్తోంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారంఎనిమిదినెలలపాటుపరీక్షలునిర్వహించినిక్షేపాలుకచ్చితంగా లభ్యమయ్యేప్రాంతాలనుగుర్తిస్తామనిఓఎన్‌జీసీఅధికారులుచెబుతున్నారు. శుక్రవారంసిర్పూర్‌(టీ) మండలకేంద్రంలోనిదుబ్బగూడకాలనీప్రాంతంలోసర్వేనిర్వహించడంతోపాటుఎంపికచేసినస్థలాల్లోడ్రిల్లింగ్‌చేసిపరీక్షలు నిర్వహించారు. అలాగేశనివారంసిర్పూర్‌(టీ), నవేగాం, హుడ్కిలిగ్రామాల్లోకేబుళ్లనుఅమర్చికంప్యూటర్లలో పరిశీలిస్తూ, డ్రిల్లింగ్‌చేశారు. దీనికిముందుగాకాగజ్‌నగర్‌మండలంలోనిఅనుకోడ, చుంచుపల్లి, గన్నారం, చింతకుంటగ్రామాలమీదుగాకేబుల్‌లైన్లువేస్తూసర్వేనిర్వహించారు. డ్రిల్లింగ్‌చేయగావచ్చేధ్వనితరంగాలద్వారానిక్షేపాలనుపసిగడుతున్నట్లు తెలుస్తోంది.

కుమురంభీం– మంచిర్యాల– భద్రాచలంమీదుగా.. 
రెండవదశ సర్వేకాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగునుంచి కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాలజిల్లా మీదుగా భద్రాచలం జిల్లాల్లో ప్రాథమిక సర్వేలునిర్వహిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 8 నెలలపాటు సర్వే చేయనున్నట్లువెల్లడించారు. నిక్షేపాలున్న స్థలాలను గుర్తించి పూర్తిస్థాయి సర్వేలుచేపడతామని తెలిపారు. కుమురంభీంజిల్లాతోపాటు మంచిర్యాల పరిసరప్రాంతాల్లోని భీమిని మండలంనందుగులగూడ గ్రామ పరిసరాల్లో ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలున్నట్లు పేర్కొన్నారు. 

పూర్తిస్థాయిసర్వేలు చేపడతాం 
కుమురం భీంజిల్లాలోనిపలుగ్రామాల్లోఓఎన్‌జీసీఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాల కోసంప్రాథమికసర్వేలు చేపడుతున్నాం. సర్వేల రిపోర్టు లు, డ్రిల్లింగ్‌లో వెల్లడైన ఫలితాల ఆధారంగా 8 నెలలపాటు పూర్తిస్థాయి సర్వేలు చేపడతాం. నిక్షేపాల తీరునుబట్టి స్థానికంగా వెలికితీత ప్రారం భమవుతుంది.     
– సత్తిబాబు, ఓఎన్‌జీసీ, పీఆర్వో 

మరిన్ని వార్తలు