ప్రభుత్వానికి విరాళంగా వృద్ధాశ్రమం

11 Jan, 2019 02:43 IST|Sakshi
కేటీఆర్‌ను కలిసిన వృద్ధ దంపతులు..చిత్రంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరులో నిర్మించిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావును గురువారం కలిసి పూర్తి వివరాలు అందిం చారు. ‘ఎకరంన్నర భూమిలో 6 వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మిం చాం. అనారోగ్యం కారణంగా భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం గా ఇవ్వడంతో వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలి’అని కేటీఆర్‌ను కోరారు.

ఈ అంశం పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో మాట్లాడతారని కేటీఆర్‌ చెప్పారు. వృద్ధ దంపతులు ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని దంపతులకు కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కేటీఆర్‌ మాట్లాడారు. వృద్ధ దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్‌ కొనియాడారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

సర్పంచ్‌ పదవి కోసం హంగామా

కేంద్రంపై సీఎం విమర్శలు సరికాదు: దత్తాత్రేయ

పుస్తక రూపంలో చెన్నారెడ్డి జీవిత చరిత్ర

వామపక్షాలు..‘ఉనికి’ పాట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రహస్యం ఏంటో?

హిరానీ టూ?

మనసు బంగారం

ఫెయిల్యూర్‌ రాకూడదని పని చేస్తాను

పాంచ్‌ పటాకా

టైమ్‌ మిషన్‌ ఎక్కుతున్నారు