పోలీసుల అత్యుత్సాహం

1 Feb, 2017 02:17 IST|Sakshi
పోలీసుల అత్యుత్సాహం

► సీఎం బందోబస్తు పేరుతో వాహనాల నిలిపివేత
► కారులోనే గుండెపోటుతో వృద్ధురాలి మృత్యువాత

సాక్షి సూర్యాపేట: పోలీసుల అత్యుత్సాహానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన సూర్యాపేటలో మంగళవారం జరిగింది. పట్ట ణంలోని శ్రీరాంనగర్‌లో సోమా అంజయ్య, లక్ష్మమ్మ(65) కుటుంబం నివాసం ఉంటోంది. లక్ష్మమ్మ ఉదయం 11 గంటలకు గుండెపో టు, ఆస్తమాతో బాధపడుతుండగా.. స్థానిక గాయత్రి నర్సింగ్‌ హోంలో చికిత్స చేయించేందుకు కారులో బయలుదేరారు. అయితే మంగళవారం ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభో త్సవానికి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ మార్గ మధ్యలో సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటి వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగా రు. అదే సమయంలో అటుగా వస్తున్న లక్ష్మమ్మ కారును పోలీసులు ఆపేశారు.

ముందుగా ఫ్లై ఓవర్‌ కింది నుంచి ఆస్పత్రికి వస్తుండగా.. అటుకాదు మరోవైపు నుంచి వెళ్లాలని పోలీసులు కారును మళ్లించారు. అనంతరం 60 ఫీట్ల రోడ్డు నుంచి వస్తుండగా అక్కడ ఉన్న పోలీసులు నిలిపి వేశారు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, గుండెపోటుతో ఉన్న ఆమెకు వైద్యం అంద కపోతే ఇబ్బంది అవుతుందని పోలీసులను బతిమిలాడినా స్పందించలేదని అంజయ్య వాపోయారు. దీంతో తన భార్యను బతికిం చమని డాక్టర్‌ వద్దకు పరుగు పెట్టానని, డాక్టర్‌ కారు వద్దకు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని బోరున విలపించాడు.

పోలీసులు ఆటంకం కలిగించలేదు..
సోమా లక్ష్మమ్మ వస్తున్న వాహనానికి పోలీసులు ఆటంకం కలిగంచలేదని సూర్యాపేట ఎస్పీ పరిమళ హననూతన్  ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కాన్వాయ్‌ వస్తున్నప్పటికీ లక్ష్మమ్మ వాహనాన్ని అడ్డుకోవద్దని సెట్‌లో చెప్పి వైద్య సేవలు అందించేలా ప్రయత్నించామని ఎస్పీ పేర్కొన్నారు. లక్ష్మమ్మకు వైద్యసేవలు అందించాలని డాక్టర్‌ రామ్మూర్తిని తీసుకెళ్లింది కూడా పోలీసులే అని తెలిపారు. లక్ష్మమ్మ పదేళ్లుగా పేషెంట్‌గా ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారని వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా