కరోనా సాయం డబ్బుతో లిక్కర్‌ షాప్‌కి

6 May, 2020 10:45 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మద్యం అమ్మకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే దుకాణాల వద్ద మద్యంప్రియులు బారులు తీరారు. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా పాటించాలనే నిబంధనలను అనేక చోట్ల పాటిస్తున్నారు. ఈ సందర్భంగా తమ బాధ అర్థం చేసుకుని మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలోని ఓ మద్యం దుకాణం వద్ద లైన్లో నిల్చొని ఉన్న ఓ ముసాలావిడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘నాకు మందు తాగడం ఎప్పట్నుంచో అలవాటు ఉంది. లాక్‌డౌన్‌తో మందు దొరక్క కల్లు తాగడంతో కడుపు ఉబ్బుతోంది. ఈ రోజు నుంచి మందు అమ్ముతున్నారని తెలిసి పొద్దున్నే వచ్చాను. మొన్ననే బియ్యం, రూ.1500 అధికారులు ఇచ్చారు. వీటితో పాటు నా పెన్షన్‌ డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుతోనే మందు కొనుకుందామని వచ్చాను. (పెన్షన్‌ డబ్బులతో మందు కొనుక్కొవడం కరెక్టేనా? అని అడగ్గా) మరేం చేస్తాం బిడ్డ. మందు కావాలి పైసలు లేవు’అని ఆ ముసలావిడ చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇక ముసలావిడ రూ.530తో ఓసీ ఫుల్‌బాటిల్‌ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిపోయింది.   
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..
ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు

>
మరిన్ని వార్తలు