తల్లీ, తండ్రి లేనోడన్నా కనికరించలే..!

13 May, 2020 13:00 IST|Sakshi
అమ్మమ్మతో కె.అరుణ్‌

వనపర్తి: పుట్టుకతో వికలాంగుడు పెన్షన్‌ ఇప్పించండనీ ఎంత మందిని వేడుకున్నా కనికరించలేదని ఓ వృద్ధురాలు సాయం కోసం కలెక్టర్‌ను ఆశ్రయించారు. వికలత్వ శాతంను ధ్రువీకరించే సదరం సర్టిఫికెట్‌ మంజూరై రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆసరా పెన్షన్‌ మంజూరు చేయలేదు. నలుగురు కార్యదర్శులు మారినా మాకుమాత్రం పెన్షన్‌ రాలేదని ఆ వృద్ధురాలు మనవడిని చూస్తూ అధికారులను వేడుకుంది. స్పందించిన డీఆర్‌డీఓ పెన్షన్‌ కోసం దరఖాస్తు చేశారా అనే విషయంపై విచారణ చేయగా.. 2019 డిసెంబర్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కె.అరుణ్‌కు ప్రభుత్వం నుంచి 2018 మే 9న సదరం సర్టిఫికెట్‌ జారీ చేశారు. 47శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మనే పెంచుతోంది. (దయ.. ‘తల్లి’చేదెవరు!)

మరిన్ని వార్తలు