కలెక్టరేట్ ఇక ఈ-ఆఫీస్

16 Jul, 2015 00:53 IST|Sakshi

నక్కలగుట్ట : వరంగల్ కలెక్టరేట్ ఇక ఈ-ఆఫీస్‌గా మారనుంది. జిలాల కలెక్టరేట్‌లోని ఫైళ్లనీ ఇకనుంచి ఆన్‌లైన్ లో కరస్పాండెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతి ఫైల్‌ను ఒక్క సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు వెళ్లాలన్నా ఆన్‌లైన్లోనే పంపనున్నారు. దీనికి గానూ కలెక్టరేట్ లోని ప్రతి సెక్షన్ అధికారికి ఈ-మెయిల్ క్రియేట్‌చేసి ఒక్క డిజిటల్ టోకెన్ కేటాయిస్తారు. జూలై ఒక్కటి నుంచి ఏడు వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డిజిటల్ ఇండియా వారోత్సవాలుగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ-ఆఫీసుల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు.

రాష్ర్టం లోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ-ఆఫీసులుగా మార్చాలని నిర్ణయం తీసుకుని సెప్టెంబర్‌లోగా ఈ ప్రతిపాదనను పూర్తి చేయూలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అధికారులు ఎక్కడ ఉన్నా పనులు చకచకా అయ్యే అవకాశాలు ఉన్నారుు. కలెక్టరేట్‌తో పాటు వరంగల్ గ్రేటర్ నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయూల్లో సైతం ఈ- ఆఫీస్‌గా మార్చేందుకు అన్ని విభాగాల్లోనూ సన్నాహాలు కొనసాగుతున్నారుు. ఈ కార్యకర్యక్రమం విజయవంతం అరుుతే జనగామ మున్సిపాలిటీ, జిల్లాలోని నగర పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా ఇ- ఆఫీఆఫీసు అమలులోకి రానున్నాయి.
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా