12 నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

9 Jun, 2014 23:46 IST|Sakshi

కలెక్టరేట్: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు స్పెషల్ పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డివిజనల్, మండల స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పారి శుద్ధ్య డ్రైవ్ కింద జిల్లా, డివిజనల్, మం డల గ్రామస్థాయిలోని మురికి కాల్వలను శుభ్రపర్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మురికి కాల్వలకు ఇరువైపులా ఉండే పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు మంచినీటి పైప్‌లైన్ల లీకేజీలు, ఇతర మరమ్మతు పనులను శ్రమదానం ద్వారా చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.  ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న దృ ష్ట్యా బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చడం, బడి బయట పిల్లలను కేజీ బీవీలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నా రు.

విత్తన కొరత రాకుండా చూడాలి
జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా వ్యవసాయాధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. సోయాబీన్ విత్తనాలు అవసరమయ్యే గ్రామాలకు నేరుగా వెళ్లి పంపిణీ చేయాలని గ్రామస్థాయిలో గ్రామైఖ్య సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీకి అవపరమైన వారికి లెసైన్స్‌లు మంజూరు చేయాలన్నారు.  డిమాండ్ ఉన్న విత్తనాలను సీఎం దృష్టికి తీసుకవెళ్లేంతవరకు వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులు, ఏడీఏ, ఏఈఓలు గుర్తించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.  అలాగే జిల్లాలో మూడు దఫాలుగా కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటుతున్నామని కాల్వలు, చెరువు గట్లు, రహదార్లకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నామన్నారు. ఇం దిరమ్మ పచ్చతోరణంలోను  ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో మెక్కలు నాటనున్నట్లు వివరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఖాళీ స్థలాల్లో మొదటిదశ లోనే మొక్క లు నాటడానికి ప్రణాళికలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించా రు.కార్యక్రమంలో ఏజేసీ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి , డ్వామా పీడీ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
 
జిల్లా అధికారులు హాజరు కావాలి
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులంతా తప్పని సరిగా హాజరు కావాలని ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కొందరు గైర్హాజర్ కావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
 
ఆగస్టులో ఆర్మీ రిక్రూట్‌మెంట్
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని ఆగస్టు మొదటి వారంలో సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కన్నల్ యోగెన్ మొదలియార్, రిక్రూట్‌మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ఎం.ఎన్.రాథోడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాలకు కూడా సంగారెడ్డిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.    ప్రతి రోజు రెండు జిల్లాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు