ఈసారి మాత్రం గెలుపు మాదే.. కాదు మళ్లీ మాదే

23 Mar, 2015 13:49 IST|Sakshi

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోమవారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో టీఆర్ఎస్ నేత, బీజేపీ నేత మధ్య స్వల్ఫ వాగ్వాదం చోటుచేసుకుంది. మా పార్టీనే గెలుస్తుందంటే మా పార్టీనే గెలుస్తుందంటూ వారి మధ్య మాటలు పేలాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు తామే గెలుచుకుంటామని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అయితే, తమకు అసలు పోటీనే లేదని, టీఆర్ఎస్పై గెలవలేని ప్రతిపక్షాలన్నీ ఈ ఎన్నికల్లో ఒక్కటయ్యాయని టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇచ్చిందని.. అయినప్పటికీ విజయం తమదేనని అన్నారు. ఫలితాలు చూసి బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో కల్పించుకున్న ఇంద్ర సేనారెడ్డి ఈసారి టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చేందుకు అందరూ సిద్ధమయ్యారని, తాము గెలుస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు