అత్యధిక ‘గిరాకి’ పోలీస్‌ స్టేషన్‌

24 Aug, 2019 12:54 IST|Sakshi

ఖమ్మం త్రీటౌన్‌ సీఐ పీఠం ఎవరిదో.. 

రాష్ట్రంలో అత్యధిక గిరాకీ కుర్చీల్లో ఇదొకటి

జిల్లాలో సీఐల బదిలీలు పూర్తయినా భర్తీ కాని త్రీటౌన్‌

పోటీ పడుతున్న ఆశావహులు 

సాక్షి, ఖమ్మం : అవకాశం ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనుకోసుకోవాలని ఎవరికి ఉండదు.. అలాంటి పోస్టు దొరికితే వదులుకునే దురదృష్టవంతులు ఎవరుంటారు.. అందుకే ఇప్పుడు చాలా మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల చూపు ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌పై పడింది.. నాలుగు రాళ్లు సమకూరే ప్రాంతం కావడంతో ఆ స్టేషన్‌లో పోస్ట్‌ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు ఆ శాఖలో నెలకొంది. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన  స్టేషన్లలో ఇది ఒకటి కావడం గమనార్హం. జిల్లాలో అన్ని  సర్కిళ్లలో బదిలీలు జరిగినా త్రీటౌన్‌కు సీఐని నియమించకపోవడంతో ఆ శాఖలో ఆసక్తి నెలకొంది.

ఖమ్మం నగరంలో ఎంతో కీలకమైన త్రీటౌన్‌ సీఐ పోస్ట్‌ కోసం రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరిగి పోతోంది. ఇటీవల బదిలీలో అక్కడ పనిచేస్తున్న సీఐ షూకూర్‌ బదిలీపై మణుగూరు వెళ్లిన విషయం విదితమే. ఈ స్టేషన్‌కు పోలీస్‌ ఉన్నతాధికారులు ఎవరికీ కేటాయించకపోవటంతో పలవురు ప్రజాప్రతినిధుల ద్వారా ఈ పోస్టును దక్కివంచుకోవడానికి కొందరు సీఐలు ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నగరంలో రెండు పోలీస్‌ స్టేషన్‌లలో  ఎస్‌హెచ్‌వోలుగా పనిచేస్తున్న ఇద్దరు, గతంలో ఖమ్మంలో ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేసి ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..   

త్రీటౌన్‌కు ఎందుకంత క్రేజ్‌... 
నగరంలోని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ రాష్ట్రంలో పోలీస్‌లకు ఆదాయ వనరులుగా చెప్పే పోలీస్‌స్టేషన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. మొదటి నుంచి ఈ పోలీస్‌ స్టేషన్‌కు క్రేజ్‌ ఎక్కువే. చాలా మంది పోలీస్‌ అధికారులు ఒకసారి ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పనిచేస్తే చాలు జీవితంలో అన్నివిధాలుగా స్థిరపడినట్లే అని చెబుతూ ఉంటారు.  గతంలో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు అధికారిగా రావాలంటే పోలీస్‌ ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉండాలి. ప్రస్తుతం పరిస్థితి మారిపోవటంతో ప్రజాప్రతినిధుల చేతిలోకి వెళ్లటంతో ఖాళీ అయిన ఈ పోలీస్‌ స్టేషన్‌ కుర్చీకోసం పోటీపడేవారు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతంలో ఉన్న గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్‌ ఖమ్మం జిల్లాకు గుండెకాయ వంటివని చెప్పవచ్చు.

నిత్యం ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు నడుస్తూ ఉంటాయి. దీనికి తోడు త్రీటౌన్‌ ప్రాంతం అంతా ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నగరంలో వన్‌టౌన్, టూటౌన్, ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతాల మాదరిగా నిత్యం ధర్నాలు, ఘర్షణలు తక్కువ. ఈ మూడు పోలీస్‌ స్టేషన్లతో పోలిస్తే అసాంఘిక కార్యకలాపాలు సైతం తక్కువ అని చెప్పవచ్చు. అందువల్లనే ఉమ్మడి జిల్లాలోనే ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు అతి త్వరలో భర్తీకానున్న ఈ పోలీస్‌ స్టేషన్‌ కుర్చీ ఎవరికి దక్కనుందో ప్రజాప్రతినిధులు ఎవరిని కరుణించనున్నారో వేచి చూడాల్సిందే. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోడు పోరు.. శిక్ష ఖరారు..! 

మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో..

పట్టపగలే దోచేశారు

సిఫార్సు ఉంటేనే సీటు!

మలిదశ పోరుకు సన్నద్ధం

డెంగీ కౌంటర్లు

పటేల్‌ తరహాలో మోదీ సక్సెస్‌ అయ్యారు

భయం..భయం

‘పీక్‌’ దోపిడీ!

ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే

కార్డు కష్టాలు

వెంబడించి కారుతో ఢీకొట్టి.. వ్యక్తి దారుణ హత్య

ఒక్కరోజే.. 6 లక్షల మొక్కల పంపిణీ

26, 27న నీళ్లు బంద్‌

అరుదైన మూలికలు@సంతబజార్‌

బీజేపీ నేత కుమారుడు లండన్‌లో మిస్సింగ్‌

ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కావాలి

అక్కడా.. ఇక్కడా కుదరదు

గాఢ నిద్రలో ఉండగా ముగ్గురిని కాటేసిన కట్లపాము

నగరంలో ఫ్లెమింగోల సందడి

హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి

నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

గణేష్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు 

‘ఆ గ్రామాల్లో మల్లన్నసాగర్‌ పనులు ఆపేయండి’ 

తల ఒకచోట.. మొండెం మరోచోట 

సీబీఐ విచారణకు సిద్ధం! 

టీఆర్‌ఎస్‌దే బోగస్‌ సభ్యత్వం: లక్ష్మణ్‌ 

వాంటెడ్‌.. శవాలు!

గులియన్‌ బరి డేంజర్‌ మరి

ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషిచేస్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

బల్గేరియా వెళ్లారయా

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

యాక్షన్‌ రాజా