అప్పులధికమై.. బతుకు భారమై..

5 Nov, 2017 15:23 IST|Sakshi

జీవితంలో స్థిరపడేందుకు ఓ యువకుడు వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాడు... అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు.. కొన్నాళ్లు సాఫిగానే సాగిన వ్యాపారంలో నష్టాలు వచ్చాయి...వాటిని పూడ్చుకునేందుకు మళ్లీ అప్పులు చేశాడు.. ఇటు వ్యాపారంలో నష్టాలు.. అటు తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరిగిపోతుండడంతో కలత చెందాడు. అధికమవుతున్న అప్పులు.. భారంగా మారుతున్న బతుకును ముందుకు సాగించలేక.. ఇక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మునుగోడులో శనివారం ఈ విషాదకర ఘటన  వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మునుగోడు : నియోజకవర్గ కేంద్రానికి చెందిన మేడం వెంకన్న, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు చొప్పున కుమారులు, కుమార్తెలు సంతానం. వీరిలో చిన్నకుమారుడు మేడం నవీన్‌ (38) డిగ్రీ వరకు చదివాడు. కంప్యూటర్‌ విద్యను నేర్చుకుని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తునే మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ప్రైవేట్‌గాచాలీచాలని వేతనాలు ఇస్తుండడంతో కుటుంబ పోషణ నిమిత్తం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల క్రితం మండల కేంద్రంలోని కూల్‌డ్రింక్‌ దుకాణాన్ని ప్రారంభించాడు. ఏజెన్సీకి రూ.10 లక్షలు, పెట్టుబడికి మరో రూ. 5 లక్షలు అప్పు చేశాడు. 

తల్లిదండ్రిని పడుకోమని చెప్పి..
సదరు కంపెనీ రద్దుచేసుకున్న ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలో  తాత్సారం చేయడం.. ఇటు అప్పుల వారి ఒత్తిడి పెరుగుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల వరకు స్నేహితులతో గడిపిన నవీన్‌ అనంతరం తల్లిదండ్రి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటలకు వరకు వారితో ముచ్చటించి ఇక పడుకొండని చెప్పి బయటికి వెళ్లాడు. అనంతరం ఇంటిపైకి ఎక్కి ఎరువుల దుకాణంలో తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.  రాత్రి 10 గంటలైనా భర్త ఇంటికి రాకపొవడంతో పలుమార్లు అతనికి భార్య మహేశ్వరి పోన్‌చేసినా లిఫ్ట్‌ చేయలేదు. ఉదయం వరకు కన్పించకపొవడంతో చుట్టు పక్కలవారు గమనించగా ఇంటిపైనే మృతిచెంది ఉ న్నాడు. సమాచారం మేరకు ఎస్‌ఐ రాములు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పులబాధతో యువ వ్యాపారి మృతిచెందడంతో మునుగోడులో విషాదం అలుముకుం ది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

ఏజెన్సీని రద్దు చేసుకుని..
కొన్నాళ్లుగా బాగానే సాగిన వ్యాపారంలో క్రమ క్రమంగా నష్టాలు వచ్చాయి.  బిజినెస్‌ను వృద్ధి చేయాలనే ఉద్దేశంతో మళ్లీ అప్పు చేశాడు. అయినా వ్యాపారం బాగా సాగలేదు. తీసుకున్న అప్పుల భారం సుమారు రూ.20 లక్షలు దాటడడంతో తీవ్ర మనోవేదనచెందాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఏజెన్సీని రద్దు చేసుకుని వచ్చే రూ. 10 లక్షలతో కొంతైనా అప్పు తీర్చాలని అనుకున్నాడు. 

>
మరిన్ని వార్తలు