మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి

21 May, 2015 01:35 IST|Sakshi
మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి

తూప్రాన్: మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి జరిగింది. చెరువులో కొలతలు తీస్తున్న కూలీ విద్యుదాఘాతానికి గుైరె  మరణించాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పాలాట గ్రామానికి చెందిన చాకలి మంచె లక్ష్మయ్య (45) కూలీ. లింగారెడ్డిపేట పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో కొలతలు తీయడానికి బుధవారం కూలీగా వచ్చాడు. ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు ప్రారంభించారు.

చెరువు మత్తడిపై నిలబడి సిల్వర్‌తో తయారు చేసిన స్కేల్‌ను పట్టుకుని ఉండగా పైనే ఉన్న 33/11 విద్యుత్ వైరు తగిలి స్పృహ కోల్పోయాడు. చెరువు కాంట్రాక్టర్ కడపాల రాజు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇంద్రతో పాటు మరికొందరు కలసి 108లో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. అయితే, ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తూప్రాన్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు