మదినిండా పెద్దాయనే..

18 Nov, 2018 17:05 IST|Sakshi
వైఎస్సార్‌ పేరుతో ఉన్న స్కూటర్‌ వర్క్స్‌ షాప్‌ 

సేవలో తరిస్తున్న వైఎస్సార్‌ వీరాభిమాని 

 సాక్షి, చంద్రశేఖర్‌కాలనీ: ఆయన మదినిండా వైఎస్సారే కొలువయ్యారు..  వైఎస్సార్‌పై ఉన్న అభిమానం తో తన స్కూటర్‌ రిపేరింగ్‌ దుకాణానికి వైస్సార్‌ స్కూటర్‌ రిపేరింగ్‌ వర్క్స్‌ అని పెట్టుకున్నారు. ఆయనే నగరంలోని బడాబజార్‌కు చెందిన భిక్షపతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన చేసిన సేవలను ముగ్ధుడైన భిక్షపతి ఆయననే దేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానం.. ఆయన చేసిన సేవలను నలుగురికీ చెబుతూ అందరినోటా ‘వైఎస్సార్‌ భిక్షపతి’గా నిలిచిపోయారు.

నగరరంలోని బడాబజార్‌లో వైఎస్సార్‌ స్కూటర్‌ రిపేరింగ్‌ వర్క్స్‌ పేరుతో షాప్‌ నిర్వహిస్తున్న నూరి భిక్షపతికి వైఎస్సార్‌ అంటే ఎనలేని అభిమానం. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్,  ఆరోగ్యశ్రీ, విద్యార్థులక ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు ఇలా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించగా వాటిని ముగ్ధుడైన భిక్షపతి అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను పదిమందికీ వివరిస్తూ ఉంటారు. వైఎస్‌ పేరునే స్కూటర్‌ రిపేరింగ్‌ షాప్‌ను పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

సుమారు 25ఏళ్లుగా స్కూటర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న భిక్షపతి తన షాప్‌లో ప్రతిఏటా వైఎస్‌ జయంతి, వర్ధంతులను సొంత ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీ జయంతి, రిపబ్లిక్‌ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాడు. స్థోమత లేకున్నప్పటికీ తనకు ఉన్నదాంట్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌పై తన అభిమానాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పులివెందుల, హైదరాబాద్‌లో వైఎస్‌ కుటుంబసభ్యులతో, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కలిశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు