ఒకవైపు విద్యార్థులు.. మరోవైపు ఆందోళనలు..

19 May, 2018 15:48 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన పాఠశాల నవోదయ పాఠశాల. ఈ విద్యాసంస్థలో ప్రవేశం కొరకు ప్రతి ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నిజాంసాగర్ మండలంలోని నవోదయ పాఠశాలలో నిర్వహించాలనుకున్నారు. అయితే 9వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్నాహ్నం అయినా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో పరీక్షపత్రం లీకేజ్ అయ్యిందంటూ వదంతులు వ్యాపించాయి. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా నవోదయ పరీక్ష చీఫ్‌ఎక్సామినర్‌ మాట్లాడుతూ..కేవలం కొన్నిసాంకేతిక సమస్యల వల్ల మాత్రమే పరీక్ష ఆలస్యం అయిందని, కొందరు ఆకతాయిలు సృస్టిస్తున్న వదంతులను నమ్మవద్దని తల్లిదండ్రులను, విద్యార్థులను కోరారు. ఆందోళనల నడుమ ఎట్టకేలకు 1గంటకు పరీక్ష ప్రారంభమైంది.  స్థానిక ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారికి అవగాహన లోపంతోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు