ప్రాణంతీసిన భూవివాదం

21 Aug, 2015 01:40 IST|Sakshi

బల్మూర్/నాగర్‌కర్నూల్ రూరల్: భూతగాదాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. భూ వివాదం సంఘటనలో బావబావమరిది పురుగు మందుతాగడంతో వారిలో ఒక రు చనిపోయారు. ఈ సంఘటన గురువారం బల్మూర్ మండలం జిన్‌కుంటలో విషాదం నింపింది. బాధితులు, పో లీసుల కథనం మేరకు.. జిన్‌కుంట గ్రా మానికి చెందిన కాలూరి నిరంజన్(35)కు దాయాదులైన మల్లయ్య, సత్యనారాయణ, శ్రీశైలం మధ్య కొంతకాలంగా భూవివాదాలు ఉన్నాయి. దీనిపై గతంలో బల్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
 
  క్రమంలో మంగళవారం నిరంజన్‌తో పాటు మంగళకుంటపల్లికి చెందిన అతడి బావ కృష్ణయ్యపై దాయాదులు దాడిచేశారు. పోలీసులకు ఫిర్యాదుచేయగా దాయాదులపై కేసునమోదైంది. ఈ ఘటన పట్ల మనస్తాపానికి గురైన కృష్ణయ్య మంగళకుంటపల్లికి వెళ్లి పురుగుమందు తాగాడు. అయితే తన విషయంలో వచ్చి పోలీసులతో దెబ్బలు తిని పురుగుమందు తాగాడని, అతడు చనిపోతే తనపైకి బద్నాం వస్తుందని నిరంజన్ కూడా పురుగుమందు తాగాడు. కృష్ణయ్య అచ్చంపేట ఆస్పత్రిలో చికిత్సపొంది ప్రమాదం నుంచి కోలుకున్నాడు. నిరంజన్‌ను చికిత్సకోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. శవాన్ని పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
 
 నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో హైడ్రామా!
 కాగా. తన భర్త పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని, పోలీసులు వస్తేకానీ పోస్టుమార్టం చేసేదిలేదని పట్టుబట్టి శవాన్ని అంబులెన్స్‌లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ, మరికొందరు నేతలు నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి చేరుకుని చర్చలు జరిపారు. ఈ విషయంపై నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్దన్‌ను వివరణ కోరగా..ఈ ఘటనలో పోలీసుల తప్పిదమేమీ లేదని చెప్పారు. భూతగాదాల విషయంలో దాయాదులు పలుమార్లు దాడిచేయడం వల్లే నిరంజన్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి బల్మూర్ ఎంపీపీ కరుణాకర్‌రావు రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.

మరిన్ని వార్తలు