హత్య చేశారు...ఆపై కాల్చేశారుతుర్కపల్లి :ఆస్తి తగాదాలో... ఆర్థిక లావాదేవీలో కారణం ఏదో తెలియదు గానీ ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి...ఆపై కాల్

10 Jul, 2014 01:18 IST|Sakshi
హత్య చేశారు...ఆపై కాల్చేశారు

తుర్కపల్లి :ఆస్తి తగాదాలో... ఆర్థిక లావాదేవీలో కారణం ఏదో తెలియదు గానీ ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి...ఆపై కాల్చేశారు. వివరాల్లోకి వెళితే...నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వీఆర్వో ఫిర్యాదు మేరకు బుధవారం పంచనామా నిర్వహించారు. అయి తే మృతదేహం పక్కనే దొరికిన సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్లకు ఫోన్ చేయగా మృ తుడి వివరాలు తెలిశాయి.  కేతావత్ రెడ్యానాయక్(32) సెక్యూరిటీ గార్డుగా నాచారం ఇండస్ట్రీయల్ ఏరియాలో పనిచేస్తున్నాడు. ఇతడిది బీబీనగర్ మండలం జంపల్లితండా. భార్య విజయలక్షి్ష్మతో కలిసి  ఐదు సంవత్సరాలుగా నాచారంలో నివసిస్తున్నాడు. మృతుడి సోదరుడు జాహంగీర్ (38) మూసాపేటలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు.
 
 పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్లి..
 చెల్లికి పెళ్లి సంబంధం చూడాలని జహ ంగీర్  మే 26వ తేదీన తమ్ముడు రెడ్యానాయక్‌ను వెంటబెట్టుకుని కారులో వెళ్లాడు. మల్లాపూర్ నుంచి తుర్కపల్లికి చేరుకున్నారు. భార్య విజయలక్ష్మి రాత్రి 7:30 గంటలకు రెడ్యాకు ఫోన్ చేయగా, వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నుంచి రెడ్యానాయక్ ఫోన్ పనిచేయలేదు. దీంతో అనుమానం వచ్చిన  విజయలక్షి్ష్మ బావ జాహంగీర్‌కు ఫోన్ చేసింది. ఆయనా  లిఫ్ట్ చేయలేదు. మరుసటి రోజు ఉదయం  విజయలక్షి తన బంధువులతో కలిసి  బావ జహంగీర్ ఇంటికి వెళ్లి తన భర్త ఆచూకీ కోసం నిలదీసింది. ‘నాకు తెలియదు.....నావెంట రాలేదు 7 సంవత్సరాల నుంచి నాకు నా తమ్ముడికి మాటలు లేవంటూ’’ జహంగీర్ చెప్పాడు.
 
 దీంతో విజయలక్ష్మి నాచారం పోలీసులను ఆశ్రయించింది. వెంకటాపూర్ వద్ద లభ్యమైన శవం వద్ద ఉన్న సెల్‌ఫోన్ వివరాల ఆధారంగా నాచారం పోలీసులతో కలిసి ఆమె ఇక్కడకు వచ్చింది. శవం మెడలో ఉన్న ఆంజనేయస్వామి దండ, చేతికున్న తాడు, బట్టల ఆధారంగా మృతుడు తన భర్తేనని భార్య విజయలక్ష్మి గుర్తించింది. హత్య చేసి 40 రోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి ఉంది, ఒక కాలు శవం నుంచి ఉండిపోయి ఉంది. చుట్టూ బీరుసీసాలు, మద్యం బాటిళ్లు ఉన్నాయి. కేసును నాచారం సీఐ అశోక్‌కుమార్, తుర్కపల్లి ఎస్‌ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ దర్యాప్తు చేసి విచారిస్తున్నారు.  
 
 ఆస్తికోసమే అంతమొందించాడు : మృతుడి భార్య
 రెడ్యానాయక్, జహంగీర్‌కు జంపల్లి గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. జహంగీర్‌కు గ్రామం లో అప్పులు ఎక్కువ కావడంతో ఆ భూమిని విక్రయించాలని తమ్ముడితో ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యం లోనే తన భర్తను జహంగీర్, ఇతర కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఉంటాడని మృతుడి భార్య విజయలక్ష్మి ఆరోపించింది.
 

మరిన్ని వార్తలు