పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టబోయి..

9 Apr, 2015 01:00 IST|Sakshi
పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టబోయి..

వరంగల్: రైలు పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టి.. రైలు వచ్చి వెళ్లిన తర్వాత గుండ్రటి రేకులా మారుతుండడంతో తనూ అలాంటి రూపాయి కోసం పట్టాలపైకి వెళ్లి ఓ విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాలు.. జిల్లాలోని గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలికి చెందిన మంద చందు(14) బుధవారం ధర్మారంలో పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చాడు. అయితే, చందు.. మరికొందరు విద్యార్థులు సరదాగా రైలు పట్టాలపై రుపాయి బిళ్ల పెట్టి.. అది వెడల్పు అయిన తర్వాత తీసుకోవాలని భావించారు.

ఈ క్రమంలో పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టేందుకు చందు వెళ్లగా.. అదే సమయంలో వరంగల్- విజయవాడ మార్గంలో రైలు వస్తోంది. అయితే చందు తప్పుకోవడానికి ప్రయత్నించగా, పట్టాల పక్కనే ఎర్త్ కోసం పెట్టిన ఇనుప పట్టీ కాలికి తట్టుకొంది.  కాలు తీసే ప్రయత్నం చేస్తుండగా, రైలు వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు