ఆన్‌లైన్‌లో అఆఇఈ

17 Jul, 2020 04:49 IST|Sakshi

రూపుమారిన అంగన్‌వాడీలు

పాటలు, పద్యాలు, కథలు, ఆటల వీడియో పాఠాలు

కోవిడ్‌ పరిస్థితి చక్కబడ్డాక అందుబాటులోకి..

ఉ.9 నుంచి సా.4 గంటల వరకు..

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీల రూపురేఖలు మారనున్నాయి. ఆన్‌లైన్‌లో అఆఇఈ నేర్పనున్నారు. చిన్నారుల్లో ప్రేరణకు కొత్త పాఠ్యాంశా లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివర కు పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే కొనసాగిన ఈ కేంద్రాలు త్వరలో ప్రీస్కూళ్లు(పూర్వ ప్రా థమిక పాఠశాల)గా మారనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అంగన్‌వాడీల బోధనను ఆన్‌లైన్‌లో సాగించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అంగన్‌వాడీల నిర్వహణకు సం బంధించిన కార్యాచరణను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది.

ప్రీ స్కూళ్లుగా 35,700 అంగన్‌వాడీలు
రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్‌(సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టుల పరిధు ల్లో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నా యి. ఈ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులు 9.17 లక్షల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 4.80 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు బాలామృతంతోపాటు ఇతర పౌష్టికాహారాన్ని అందించేవా రు. ఆ తర్వాత పిల్లల ఆసక్తిని బట్టి ఆడించడం లేదా ఇంటికి పంపడం జరిగేది. ఇక పై ఈ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలు గా మారనున్నాయి. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కనీ సం ఆరుగంటలపాటు ఈ కేంద్రాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం మా త్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది. 

ప్రత్యేక పాఠ్యాంశం
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించింది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కథలు, పాటలు, ఆటలు, మా నసిక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిం చింది. ఇవన్నీ వీడియోల రూపంలో తయారు చేసింది. పిల్లలకు అలవాట్లు, పరిసరాల గురిం చి ఎరుక పర్చడం, అక్షరాలు నేర్పడం, అంకెల తో కూడిన పాఠాలు, కథలు, నృత్యరూపక పా టలు, సృజనాత్మకత పెంచే పజిల్స్, తెలుగు, ఇంగ్లిష్‌ భాషలపై అవగాహన పెంచే పదాలు, పిల్లల అభివృద్ధి అంశాలతో కూడిన వీడియో లు, యానిమేషన్‌ రూపంలో వీడియోలను ఆ శాఖ సిద్ధం చేసింది. ఇవి అంగన్‌వాడీల్లో అందుబాటులో ఉంటాయి. పిల్లల తల్లిదండ్రుల కోసం ఈ వీడియోలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.

మరిన్ని వార్తలు