ఒక్క క్లిక్‌ చాలు మెకానిక్‌ మీ చెంతకు

20 Oct, 2019 08:01 IST|Sakshi

మార్గమధ్యలో రోడ్డుపై బండి ఆగిపోయిందా?  

ఒక్క క్లిక్‌ చేయండి చాలు మెకానిక్‌ మీ చెంతకు

‘గో గాడీ’ పేరుతో యాప్‌నకు రూపకల్పన   

కారు, బైక్‌ మొరాయించిన చోటికే వచ్చి రిపేర్‌  

వినూత్న ఆలోచనకు ముగ్గురు మిత్రుల శ్రీకారం  

మీ బైక్‌ అర్ధాంతరంగా రోడ్డుపై ఆగిపోయిందా? ఆఫీస్‌కు వెళ్లే సమయంలో కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయా? టైర్‌ పంక్చరయ్యిందా? లేదా యాక్సిండెంట్‌ అయ్యిందా? బైక్‌ లేదా కారుని మార్గమధ్యలో విడిచిపెట్టలేక, మెకానిక్‌ వద్దకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇలా ఏ రిపేర్‌ అయినా సరే.. తమ మెకానిక్‌ వచ్చి రిపేర్‌ చేసి సమస్య పరిష్కరిస్తాడంటున్నారు సిటీకి చెందిన ముగ్గురు యువకులు. కేవలం ఒక్క క్లిక్‌ లేదా ఒక్క ఫోన్‌ కాల్‌తో మీరున్న చోటకే మెకానిక్‌ వచ్చి వాహనాన్ని రిపేర్‌ చేస్తారని భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం ‘గో గాడీ’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు సూర్యతేజ, ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్‌లు.

సాక్షి, సిటీబ్యూరో:నెల్లూరుకు చెందిన ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్, సూర్యతేజలు నగరంలోని ఖాజాగూడలో స్థిరపడ్డారు. ప్రజిత్‌రెడ్డి కంప్యూటర్‌ సైన్స్, మిత్రవర్షిత్‌ ఆర్కిటెక్, సాయితేజ ఎంబీఏ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే వీళ్లు స్నేహితులు. ఓ రోజు సిటీ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు మార్గమధ్యలో మొరాయించింది. సంబంధిత సర్వీస్‌ సెంటర్‌కు కాల్‌ చేస్తే.. వాళ్లు సరిగా రెస్పాండ్‌ కాలేదు. చిరాకు వచ్చి కారు అక్కడే వదిలేసి వేరే వెహికల్‌లో విజయవాడ వెళ్లారు. ఈ సమస్య వీళ్ల ముగ్గురిదే కాదు. వీళ్ల బంధువులు, తెలిసిన వాళ్లకు కూడా ఎదురైంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఏదైనా కొత్తగా ఆలోచించాలని ప్రయత్నించారు. ఆ ఆలోచనలో భాగంగానే ‘గో గాడీ’ యాప్‌నకు శ్రీకారం చుట్టారు.  

యాప్‌ వినియోగమిలా..  
మీ మొబైలోని ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ‘గో గా>డీ’ని సెర్చ్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, నంబర్‌ ఎంటర్‌ చేసి లాగిన్‌ కావాలి. మార్గంమధ్యలో ఎక్కడైనా కారు లేదా బైక్‌ అగిపోతే ఈ యాప్‌ని క్లిక్‌ చేయాలి. క్లిక్‌ చేయగానే ‘కారు/బైక్‌ సర్వీస్, కార్‌/బైక్‌ స్పా, కార్‌/బైక్‌ యాక్ససిరిస్, రోడ్‌సైడ్‌ (గో గాడీ) అసిస్టెన్స్‌’ అనే ఆప్షన్స్‌ వస్తాయి. దీనిలో మనకున్న రిపేర్‌ని ఆ ఆప్షన్స్‌ ద్వారా ఎంచుకుని మనం ఉన్నచోటకు మెకానిక్‌కి పిలిపించుకోవచ్చు. ఇలా ఒక్క క్లిక్‌ చేసిన 20 నిమిషాల వ్యవధిలో మనం ఉన్న చోటకు మెకానిక్‌ వస్తాడు. యాప్‌ని వాడలేని వారు 79939 19293కు కాల్‌ చేసినా చాలు. 

సిటీలో 500 సర్వీస్‌ సెంటర్లు
మనవద్దకు వచ్చిన మెకానిక్‌ వెహికల్‌ కండిషన్‌ చూస్తాడు. అది అక్కడిక్కడే రిపేర్‌ అయ్యేదైతే పరిష్కరిస్తారు. లేనిపక్షంలోæ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్తారు. సిటీలో మొత్తం 500 సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయి. వెహికల్‌ని మనకు నచ్చిన సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్తారు, లేదా వాళ్లకు సంబంధించిన 500 సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి రిపేర్‌ చేస్తారు. మెకానిక్‌ వచ్చి అక్కడిక్కడ సమస్యను పరిష్కరిస్తే రూ.499 చార్జి చేస్తారు. అదే వెహికల్‌ని లిఫ్ట్‌ చేసి సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళితే రూ.799. మెకానిక్‌ వచ్చేలోపు రిపేర్‌ని మనమే చేసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

మాకెదురైన సమస్య నుంచే.. 
కారు మొరాయిస్తే ఎంత చికాకు వస్తుందో.. మేం స్వయానా అనుభవించాం. అందుకే ముగ్గురం స్నేహితులం ఈ యాప్‌ని రూపొందించాం. సిటీతో పాటు విజయవాడ, నెల్లూరులలో కూడా ఈ సేవలను వాహనదారులకు అందిస్తున్నాం. యాప్‌ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా మీ వెహికల్‌ రిపేర్‌ సమ స్యని పరిష్కరించుకోవచ్చు. త్వరలో ఈ చలా నా, ఫాస్టాగ్‌ రీచార్జి, కా రు అమ్మకాలు, కొను గోలు, డోర్‌స్టెప్‌ సేవలు వంటి వాటిని  అందుబాటులోకి తేస్తాం.– సూర్యతేజ, ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేరాభియోగాలున్నా పోలీస్‌ కాలేరు

కోతకైనా సిద్ధం. ..సర్కారీ ఆస్పత్రి నిషిద్ధం!

నేడు, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు

ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ!

స్పందించకుంటే సమ్మె ఉధృతం

సమ్మె విరమిస్తేనే చర్చలు!

షేర్‌..కేర్‌ ప్లీజ్‌!

కాంగ్రెస్‌దే అధికారం

ఆర్టీసీ సమ్మె: బంద్‌ ప్రశాంతం

స్వచ్ఛ సిరిసిల్ల లక్ష్యంగా ప్రణాళికలు

బాహుబలి మూడో మోటార్‌ వెట్‌రన్‌

ఈఎస్‌ఐ స్కాం నిందితురాలు ఆత్మహత్యాయత్నం

బొటానికల్‌ గార్డెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్‌

రూమ్‌ బాయ్‌పై సురభి హోటల్‌ యజమాని దాడి

ఈనాటి ముఖ్యాంశాలు

ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ సమ్మె: సీఎస్‌, ఆర్టీసీ ఎండీకి నోటీసులు

ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ

ఉత్తమ్‌కు మంత్రి జగదీష్‌ సవాల్..

ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్‌

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన చూస్తున్నాం: కిషన్‌రెడ్డి

‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’

‘అందుకే కేసీఆర్‌ సభ రద్దు చేసుకున్నారు’

మంచిర్యాలలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు

‘ఆర్టీసీని అప్పుడే విలీనం చేసేవాడిని’

‘కుట్రపూరితంగానే అలా చెబుతున్నారు’

రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌ వాసి మృతి

ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు

‘కంటి వెలుగు’లో కాకి లెక్కలు!

‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెంటిమెంట్‌ను వదలని అజిత్‌

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

ఫలితాన్ని పట్టించుకోను

అందరూ లైక్‌ చేస్తున్న పాట

పాట.. మాట.. నటన

నూటొక్క జిల్లాలకే అందగాడు